Wednesday, 5 August 2026
  • Home  
  • స్పెషల్ గ్రేడ్ సెక్రటరీగా పదోన్నతి పొందిన శ్రీ జి.ఎస్. ప్రసాద్‌ గారు కు ఘన సన్మానం – వీడ్కోలు సభ నిర్వహణ* నాయుడుపేట ఏఎంసీ ఆధ్వర్యంలో అభినందనలు తెలిపిన చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్
- తిరుపతి

స్పెషల్ గ్రేడ్ సెక్రటరీగా పదోన్నతి పొందిన శ్రీ జి.ఎస్. ప్రసాద్‌ గారు కు ఘన సన్మానం – వీడ్కోలు సభ నిర్వహణ* నాయుడుపేట ఏఎంసీ ఆధ్వర్యంలో అభినందనలు తెలిపిన చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్

*పత్రికా ప్రకటన* *స్పెషల్ గ్రేడ్ సెక్రటరీగా పదోన్నతి పొందిన శ్రీ జి.ఎస్. ప్రసాద్‌ గారు కు ఘన సన్మానం – వీడ్కోలు సభ నిర్వహణ* నాయుడుపేట ఏఎంసీ ఆధ్వర్యంలో అభినందనలు తెలిపిన చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్ నాయుడుపేట పున్నమి న్యూస్ మద్దాలి వెంకయ్య 04-08-26 నాయుడుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీలో గ్రేడ్-1 కార్యదర్శిగా సుమారు రెండున్నర సంవత్సరాల పాటు విశిష్ట సేవలు అందించిన శ్రీ జి.ఎస్. ప్రసాద్ గారు స్పెషల్ గ్రేడ్ సెక్రటరీగా పదోన్నతి పొంది బాపట్ల వ్యవసాయ మార్కెట్ కమిటీకి బదిలీ కావడంతో, నాయుడుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఆయనకు ఘనంగా సన్మాన కార్యక్రమం మరియు వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయుడుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ ఉయ్యాల ప్రవీణ్ గారు శ్రీ జి.ఎస్. ప్రసాద్ గారిని శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి పదోన్నతి సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఉయ్యాల ప్రవీణ్ గారు మాట్లాడుతూ, నాయుడుపేట ఏఎంసీలో బాధ్యతలు నిర్వహించిన కాలంలో శ్రీ జి.ఎస్. ప్రసాద్ గారు రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ, పారదర్శకత, నిజాయితీ, సమర్థవంతమైన పరిపాలనతో మార్కెట్ కమిటీ అభివృద్ధికి విశేష కృషి చేశారని కొనియాడారు. రైతుల సమస్యల పరిష్కారంలో చొరవ, అధికారులతో సమన్వయం, ప్రజాప్రతినిధులతో సత్సంబంధాలు కొనసాగిస్తూ ఆదర్శవంతమైన సేవలను అందించారని అన్నారు. ఆయనకు లభించిన ఈ పదోన్నతి ఆయన కృషి, అంకితభావం మరియు పరిపాలనా సామర్థ్యానికి నిదర్శనమని పేర్కొంటూ, బాపట్ల వ్యవసాయ మార్కెట్ కమిటీలో స్పెషల్ గ్రేడ్ సెక్రటరీగా మరింత ఉన్నత స్థానాలను అధిరోహించి విజయవంతంగా సేవలందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చెక్ పోస్ట్ సెక్యూరిటీ నజీర్ గారి పదవీ విరమణ సందర్భంగా ఆయనని శ్రీ ఉయ్యాల ప్రవీణ్ గారు మరియు మార్కెట్ కమిటీ సభ్యులు, అధికారులు, సిబ్బంది సత్కరించారు. ఈ వీడ్కోలు సభలో మార్కెట్ కమిటీ సభ్యులు, అధికారులు, సిబ్బంది, కూటమి నాయకులు, రైతు ప్రతినిధులు పాల్గొని శ్రీ జి.ఎస్. ప్రసాద్ గారికి ఘనంగా వీడ్కోలు పలుకుతూ, ఆయన భావి సేవా ప్రస్థానానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇట్లు, జనసేన పార్టీ కార్యాలయం సూళ్లూరుపేట నియోజకవర్గం – నాయుడుపేట

*పత్రికా ప్రకటన*

*స్పెషల్ గ్రేడ్ సెక్రటరీగా పదోన్నతి పొందిన శ్రీ జి.ఎస్. ప్రసాద్‌ గారు కు ఘన సన్మానం – వీడ్కోలు సభ నిర్వహణ*
నాయుడుపేట ఏఎంసీ ఆధ్వర్యంలో అభినందనలు తెలిపిన చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్

నాయుడుపేట పున్నమి న్యూస్ మద్దాలి వెంకయ్య 04-08-26

నాయుడుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీలో గ్రేడ్-1 కార్యదర్శిగా సుమారు రెండున్నర సంవత్సరాల పాటు విశిష్ట సేవలు అందించిన శ్రీ జి.ఎస్. ప్రసాద్ గారు స్పెషల్ గ్రేడ్ సెక్రటరీగా పదోన్నతి పొంది బాపట్ల వ్యవసాయ మార్కెట్ కమిటీకి బదిలీ కావడంతో, నాయుడుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఆయనకు ఘనంగా సన్మాన కార్యక్రమం మరియు వీడ్కోలు సభ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో నాయుడుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ ఉయ్యాల ప్రవీణ్ గారు శ్రీ జి.ఎస్. ప్రసాద్ గారిని శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి పదోన్నతి సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా ఉయ్యాల ప్రవీణ్ గారు మాట్లాడుతూ, నాయుడుపేట ఏఎంసీలో బాధ్యతలు నిర్వహించిన కాలంలో శ్రీ జి.ఎస్. ప్రసాద్ గారు రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ, పారదర్శకత, నిజాయితీ, సమర్థవంతమైన పరిపాలనతో మార్కెట్ కమిటీ అభివృద్ధికి విశేష కృషి చేశారని కొనియాడారు. రైతుల సమస్యల పరిష్కారంలో చొరవ, అధికారులతో సమన్వయం, ప్రజాప్రతినిధులతో సత్సంబంధాలు కొనసాగిస్తూ ఆదర్శవంతమైన సేవలను అందించారని అన్నారు.

ఆయనకు లభించిన ఈ పదోన్నతి ఆయన కృషి, అంకితభావం మరియు పరిపాలనా సామర్థ్యానికి నిదర్శనమని పేర్కొంటూ, బాపట్ల వ్యవసాయ మార్కెట్ కమిటీలో స్పెషల్ గ్రేడ్ సెక్రటరీగా మరింత ఉన్నత స్థానాలను అధిరోహించి విజయవంతంగా సేవలందించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చెక్ పోస్ట్ సెక్యూరిటీ నజీర్ గారి పదవీ విరమణ సందర్భంగా ఆయనని శ్రీ ఉయ్యాల ప్రవీణ్ గారు మరియు మార్కెట్ కమిటీ సభ్యులు, అధికారులు, సిబ్బంది సత్కరించారు.

ఈ వీడ్కోలు సభలో మార్కెట్ కమిటీ సభ్యులు, అధికారులు, సిబ్బంది, కూటమి నాయకులు, రైతు ప్రతినిధులు పాల్గొని శ్రీ జి.ఎస్. ప్రసాద్ గారికి ఘనంగా వీడ్కోలు పలుకుతూ, ఆయన భావి సేవా ప్రస్థానానికి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇట్లు,
జనసేన పార్టీ కార్యాలయం
సూళ్లూరుపేట నియోజకవర్గం – నాయుడుపేట

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.