*తోటి స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచిన స్నేహితులు*
పున్నమి న్యూస్ ప్రతినిది
తెలంగాణ ఇంచార్జి :
రంగారెడ్డి జిల్లా
యాచారం ఏప్రిల్ 19
పదో తరగతి బ్యాచ్‌మేట్ చనిపోవడంతో అతడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి ఆసరాగా నిలిచారు తోటి స్నేహితులు.యాచారం మండలం,మాల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2009 పదో తరగతి బ్యాచ్‌కు చెందిన మంద లింగం గత నెలలో మృతి చెందాడు.దీంతో నాటి పదో తరగతి బ్యాచ్ స్నేహితులు అంతా కలిసి జమ చేసిన రూ.23 వేల 500 రూపాయల నగదును మృతి చెందిన స్నేహితుడి కుటుంబానికి అందజేశారు.మృతి చెందిన స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచిన తోటి స్నేహితుల ఔదార్యాన్ని పలువురు అభినందించారు.ఈ కార్యక్రమంలో చిన్ననాటి స్నేహితులు పల్లపు విజయ్,రామలింగం,రాజు,శేఖర్,నాగరాజు,మృతుని కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
వెళ్ళు విరిసిన మానవత్వం



