నంద్యాల: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సైనికుల్లా పనిచేసి వైసీపీ జెండా ఎగురవేయాలని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి పిలుపునిచ్చారు. నంద్యాల ఏఎస్‌ఆర్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చకుండా రైతులు, ప్రజల సమస్యలను నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు.కార్యకర్తలు ధైర్యంగా ఉండి ప్రభుత్వ వైఫల్యాలను ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరించాలని సూచించారు. కష్టపడి పనిచేసిన ప్రతీ ఒక్కరికీ పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఇసాక్ బాష, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, పార్టీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

స్థానిక ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగరేద్దాం: శిల్పా రవి