శ్రీకాళహస్తి, మే 14 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణంలోని ది స్కూల్‌కు చెందిన బస్సులను గురువారం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బి. దామోదర నాయుడు తనిఖీ చేశారు. రాబోయే విద్యా సంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకుని బస్సుల ఫిట్నెస్, కండీషన్‌తో పాటు సంబంధిత పత్రాలను పరిశీలించారు. విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్కూల్ యాజమాన్యానికి సూచించిన ఆయన, బస్సుల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదన్నారు. అలాగే విద్యార్థులతో ప్రయాణించే సమయంలో డ్రైవర్లు అప్రమత్తంగా ఉండి ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు. వేసవి సెలవుల సమయంలోనే బస్సులకు అవసరమైన మరమ్మతులు, సాంకేతిక తనిఖీలు పూర్తి చేసి కొత్త విద్యా సంవత్సరానికి సిద్ధం చేయాలని ఎంవీఐ సూచించారు. ఈ తనిఖీల్లో మోటార్ వెహికల్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

స్కూల్ బస్సుల ఫిట్‌నెస్‌పై ఎంవీఐ తనిఖీలు