వార్త ముఖ్యాంశాలు
- సూళ్లూరుపేట మున్సిపాలిటీ చైర్ పర్సన్ అభ్యర్థి *వేలూరు మునెమ్మ* గారి ఎన్నికల ప్రచారం బజార్ వీధుల్లో హోరెత్తింది.
- ఈ ప్రచార కార్యక్రమానికి సూళ్లూరుపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు *డి.కిరణ్ కుమార్* గారు ముఖ్య అతిథిగా హాజరై ప్రచారాన్ని ముందుండి నడిపించారు.
- తిరుపతి జిల్లా DCC అధ్యక్షులు *బాలగురువం బాబు* గారి దిశానిర్దేశం మేరకు, కాంగ్రెస్ నాయకులు బజార్ వీధుల్లోని ప్రతి దుకాణానికి, ఇంటింటికి తిరుగుతూ ప్రజలను కలిసి హస్తం గుర్తుపై ఓటు వేసి మునెమ్మ గారిని అధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
సూళ్లూరుపేట మున్సిపాలిటీ చైర్ పర్సన్ అభ్యర్థి *వేలూరు మునెమ్మ* గారి ఎన్నికల ప్రచారం బజార్ వీధుల్లో హోరెత్తింది.
ఈ ప్రచార కార్యక్రమానికి సూళ్లూరుపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు *డి.కిరణ్ కుమార్* గారు ముఖ్య అతిథిగా హాజరై ప్రచారాన్ని ముందుండి నడిపించారు. తిరుపతి జిల్లా DCC అధ్యక్షులు *బాలగురువం బాబు* గారి దిశానిర్దేశం మేరకు, కాంగ్రెస్ నాయకులు బజార్ వీధుల్లోని ప్రతి దుకాణానికి, ఇంటింటికి తిరుగుతూ ప్రజలను కలిసి హస్తం గుర్తుపై ఓటు వేసి మునెమ్మ గారిని అధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
*డి.కిరణ్ కుమార్ గారు మాట్లాడుతూ:* “సూళ్లూరుపేట మున్సిపాలిటీ అభివృద్ధికి, బజార్ వీధుల సమస్యల పరిష్కారానికి వేలూరు మునెమ్మ అత్యంత అర్హురాలు. మహిళా నాయకత్వానికి పెద్దపీట వేస్తూ ఆమెను చైర్ పర్సన్ అభ్యర్థిగా నిలబెట్టాం. బాలగురువం బాబు గారి ఆశీస్సులతో ఆమె గెలుపు ఖాయం. బజారు ప్రజలంతా ఆశీర్వదించాలి” అని కోరారు.
*వేలూరు మునెమ్మ గారు మాట్లాడుతూ:* “నాపై నమ్మకంతో అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ నాయకత్వానికి కృతజ్ఞతలు. బజార్ వీధుల అభివృద్ధి, పారిశుధ్యం, మహిళా సంక్షేమమే నా ధ్యేయం” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో కాళహస్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త దామోదర్ రెడ్డి, DCC జనరల్ సెక్రెటరీ గండవరం రమేష్ రెడ్డి, SC సెల్ జిల్లా అధ్యక్షులు కన్నాంబకం హరి కృష్ణ, కిసాన్ జిల్లా అధ్యక్షులు జోగి వినోద్, నియోజకవర్గ కార్యదర్శి బొగ్గుల సురేష్, మహిళా లీడర్ జోగి కావ్య మరియు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
| PUNNAMI NEWS | Reporter: Kishore