Wednesday, 19 August 2026
  • Home  
  • సుదీర్ఘ సేవలకు అభినందనలు.. రెడ్డి శివ ప్రకాష్‌కు క్యూఏఆర్‌ అండ్‌ డీ విభాగంలో ఘన సత్కారం
- విశాఖపట్నం

సుదీర్ఘ సేవలకు అభినందనలు.. రెడ్డి శివ ప్రకాష్‌కు క్యూఏఆర్‌ అండ్‌ డీ విభాగంలో ఘన సత్కారం

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌లో సుదీర్ఘకాలం సేవలందించిన రెడ్డి శివ ప్రకాష్‌ పదవీ విరమణను పురస్కరించుకుని క్యూఏఆర్‌ అండ్‌ డీ విభాగం ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విభాగంలోని అధికారులు, సహచర ఉద్యోగులు శివ ప్రకాష్‌ను శాలువాలతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. స్టీల్‌ ప్లాంట్‌లో ఆయన అందించిన సేవలను, విధి నిర్వహణలో చూపిన అంకితభావం, క్రమశిక్షణ, సహచరులతో స్నేహపూర్వకంగా మెలిగిన తీరును పలువురు కొనియాడారు. సహచరులు మాట్లాడుతూ.. సంస్థలో సుదీర్ఘకాలం పనిచేస్తూ తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించిన శివ ప్రకాష్‌ సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని అన్నారు. ఆయనతో కలిసి పనిచేసిన అనుభవాలు తమకు మధుర జ్ఞాపకాలుగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. పదవీ విరమణ అనంతరం శివ ప్రకాష్‌ కుటుంబ సభ్యులతో సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ప్రశాంతమైన జీవితం గడపాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా శివ ప్రకాష్‌ తనను ఆత్మీయంగా సత్కరించిన అధికారులు, సహచర ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 31వ తేదీన ఉక్కునగరం క్లబ్‌లో స్టీల్‌ ప్లాంట్‌ సీఎండీ సమక్షంలో శివ ప్రకాష్‌ పదవీ విరమణ కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో, క్యూఏఆర్‌ అండ్‌ డీ విభాగంలో నిర్వహించిన ఈ సన్మాన కార్యక్రమం ఆత్మీయంగా సాగింది.

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌లో సుదీర్ఘకాలం సేవలందించిన రెడ్డి శివ ప్రకాష్‌ పదవీ విరమణను పురస్కరించుకుని క్యూఏఆర్‌ అండ్‌ డీ విభాగం ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా విభాగంలోని అధికారులు, సహచర ఉద్యోగులు శివ ప్రకాష్‌ను శాలువాలతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. స్టీల్‌ ప్లాంట్‌లో ఆయన అందించిన సేవలను, విధి నిర్వహణలో చూపిన అంకితభావం, క్రమశిక్షణ, సహచరులతో స్నేహపూర్వకంగా మెలిగిన తీరును పలువురు కొనియాడారు.
సహచరులు మాట్లాడుతూ.. సంస్థలో సుదీర్ఘకాలం పనిచేస్తూ తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించిన శివ ప్రకాష్‌ సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని అన్నారు. ఆయనతో కలిసి పనిచేసిన అనుభవాలు తమకు మధుర జ్ఞాపకాలుగా నిలిచిపోతాయని పేర్కొన్నారు.
పదవీ విరమణ అనంతరం శివ ప్రకాష్‌ కుటుంబ సభ్యులతో సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ప్రశాంతమైన జీవితం గడపాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా శివ ప్రకాష్‌ తనను ఆత్మీయంగా సత్కరించిన అధికారులు, సహచర ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ నెల 31వ తేదీన ఉక్కునగరం క్లబ్‌లో స్టీల్‌ ప్లాంట్‌ సీఎండీ సమక్షంలో శివ ప్రకాష్‌ పదవీ విరమణ కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో, క్యూఏఆర్‌ అండ్‌ డీ విభాగంలో నిర్వహించిన ఈ సన్మాన కార్యక్రమం ఆత్మీయంగా సాగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.