Thursday, 1 October 2026
  • Home  
  • సమస్యల తిష్ట.. అడవిని తలపిస్తున్న పాఠశాల ఆవరణం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సమస్యల తిష్ట.. అడవిని తలపిస్తున్న పాఠశాల ఆవరణం

గేటు, కిటికీలు లేక అవస్థలు.. బూజు పట్టి అధ్వానంగా మారిన వంటగది ఆత్మకూరు, అక్టోబర్ 1 (పున్నమి ప్రతినిధి): మండలంలోని బసవరాజుపాలెం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల సమస్యలతో సతమతమవుతోంది. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సురక్షితమైన, పరిశుభ్రమైన వాతావరణం కల్పించాల్సిన పాఠశాలలో కనీస వసతులు కొరవడటంపై గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలకు సరైన గేటు లేకపోవడంతో కుక్కలు, పందులు తరచూ ఆవరణలోకి ప్రవేశిస్తున్నాయని తల్లిదండ్రులు చెబుతున్నారు. దీంతో విద్యార్థుల భద్రతపై ఆందోళన నెలకొంది.పాఠశాల ఆవరణలో చెట్లు, పొదలు, కొమ్మలు విపరీతంగా పెరిగి అల్లుకుపోయాయి. పిచ్చిమొక్కలు తొలగించకపోవడంతో పాఠశాల పరిసరాలు అడవిని తలపిస్తున్నాయి. విద్యార్థులు తిరిగే ప్రదేశాల్లోనే ఇలాంటి పరిస్థితి నెలకొనడంతో ఎప్పుడూ ఏ ప్రమాదం జరుగుతుందోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పాఠశాల ఆవరణను ఎప్పటికప్పుడు శుభ్రం చేసి పరిశుభ్రంగా ఉంచాల్సిన అవసరం ఉందని గ్రామస్థులు పేర్కొంటున్నారు.మరోవైపు పాఠశాలలోని మరుగుదొడ్లు కూడా అధ్వానంగా మారాయి. వాటి నిర్వహణ సరిగా లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తల్లిదండ్రులు చెబుతున్నారు. ముఖ్యంగా చిన్నారులకు పరిశుభ్రమైన మరుగుదొడ్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తరగతి గదులకు కిటికీలు లేకపోవడం కూడా సమస్యగా మారింది. దీంతో తరగతి గదుల భద్రత, పరిశుభ్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. బూజు పట్టిన వంటగది.. పగుళ్లతో గోడలు పాఠశాల వంటగది పరిస్థితి మరింత దారుణంగా ఉన్నట్లు గ్రామస్థులు చెబుతున్నారు. గోడలకు బూజు పట్టడంతో పాటు పలు చోట్ల పగుళ్లు ఏర్పడ్డాయి. వంటగది పరిశుభ్రత, నిర్వహణపై తగిన శ్రద్ధ అవసరమని వారు పేర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండటంపై తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వంటగదిని శుభ్రం చేసి, అవసరమైన మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.పేరుకే మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలగా ఉందని, పాఠశాలలోకి అడుగుపెడితే సమస్యలే కనిపిస్తున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల ఆవరణలోని చెట్లు, పొదలను తొలగించి పరిశుభ్రంగా మార్చడంతో పాటు గేటు ఏర్పాటు, తరగతి గదులకు కిటికీలు, మరుగుదొడ్ల మరమ్మతులు, వంటగది పునరుద్ధరణ వంటి పనులను చేపట్టాలని కోరుతున్నారు. సంబంధిత అధికారులు పాఠశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యలను పరిష్కరించాలని, విద్యార్థులకు సురక్షితమైన, పరిశుభ్రమైన వాతావరణం కల్పించేలా తక్షణ చర్యలు చేపట్టాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.

గేటు, కిటికీలు లేక అవస్థలు.. బూజు పట్టి అధ్వానంగా మారిన వంటగది

ఆత్మకూరు, అక్టోబర్ 1 (పున్నమి ప్రతినిధి): మండలంలోని బసవరాజుపాలెం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల సమస్యలతో సతమతమవుతోంది. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సురక్షితమైన, పరిశుభ్రమైన వాతావరణం కల్పించాల్సిన పాఠశాలలో కనీస వసతులు కొరవడటంపై గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలకు సరైన గేటు లేకపోవడంతో కుక్కలు, పందులు తరచూ ఆవరణలోకి ప్రవేశిస్తున్నాయని తల్లిదండ్రులు చెబుతున్నారు. దీంతో విద్యార్థుల భద్రతపై ఆందోళన నెలకొంది.పాఠశాల ఆవరణలో చెట్లు, పొదలు, కొమ్మలు విపరీతంగా పెరిగి అల్లుకుపోయాయి. పిచ్చిమొక్కలు తొలగించకపోవడంతో పాఠశాల పరిసరాలు అడవిని తలపిస్తున్నాయి. విద్యార్థులు తిరిగే ప్రదేశాల్లోనే ఇలాంటి పరిస్థితి నెలకొనడంతో ఎప్పుడూ ఏ ప్రమాదం జరుగుతుందోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పాఠశాల ఆవరణను ఎప్పటికప్పుడు శుభ్రం చేసి పరిశుభ్రంగా ఉంచాల్సిన అవసరం ఉందని గ్రామస్థులు పేర్కొంటున్నారు.మరోవైపు పాఠశాలలోని మరుగుదొడ్లు కూడా అధ్వానంగా మారాయి. వాటి నిర్వహణ సరిగా లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తల్లిదండ్రులు చెబుతున్నారు. ముఖ్యంగా చిన్నారులకు పరిశుభ్రమైన మరుగుదొడ్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తరగతి గదులకు కిటికీలు లేకపోవడం కూడా సమస్యగా మారింది. దీంతో తరగతి గదుల భద్రత, పరిశుభ్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.

బూజు పట్టిన వంటగది.. పగుళ్లతో గోడలు

పాఠశాల వంటగది పరిస్థితి మరింత దారుణంగా ఉన్నట్లు గ్రామస్థులు చెబుతున్నారు. గోడలకు బూజు పట్టడంతో పాటు పలు చోట్ల పగుళ్లు ఏర్పడ్డాయి. వంటగది పరిశుభ్రత, నిర్వహణపై తగిన శ్రద్ధ అవసరమని వారు పేర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండటంపై తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వంటగదిని శుభ్రం చేసి, అవసరమైన మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.పేరుకే మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలగా ఉందని, పాఠశాలలోకి అడుగుపెడితే సమస్యలే కనిపిస్తున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల ఆవరణలోని చెట్లు, పొదలను తొలగించి పరిశుభ్రంగా మార్చడంతో పాటు గేటు ఏర్పాటు, తరగతి గదులకు కిటికీలు, మరుగుదొడ్ల మరమ్మతులు, వంటగది పునరుద్ధరణ వంటి పనులను చేపట్టాలని కోరుతున్నారు. సంబంధిత అధికారులు పాఠశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యలను పరిష్కరించాలని, విద్యార్థులకు సురక్షితమైన, పరిశుభ్రమైన వాతావరణం కల్పించేలా తక్షణ చర్యలు చేపట్టాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.