నలుగురిపై సస్పెన్షన్.. ఇద్దరి సర్వీసులు శాశ్వతంగా తొలగింపు.. మరొకరికి టెర్మినేషన్ ఉత్తర్వులు
ఖానాపురం, మండలం, మంగళ వారి పేట గ్రామానికి చెందిన: విద్యుత్ శాఖలో విధుల పట్ల నిర్లక్ష్యం, క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడిన సిబ్బందిపై అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. ఖానాపురం మండలం మంగలవారిపేట సబ్స్టేషన్లో చోటుచేసుకున్న ఘటనకు సంబంధించి ఎనిమిది మంది విద్యుత్ సిబ్బందిపై చర్యలు తీసుకున్నట్లు సమాచారం.
సబ్స్టేషన్లో మద్యం సేవిస్తూ విధులకు హాజరవుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో అధికారులు విచారణ చేపట్టారు. విజిలెన్స్ విచారణ అనంతరం సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకున్నారు.
సస్పెన్షన్కు గురైన సిబ్బంది:
బి. నాగయ్య (ఎస్ఎల్ఎం)
పి. రాజు (ఎల్ఎం)
ఏ. రామచంద్రయ్య (ఏఎల్ఎం)
షేక్ బషీర్ (ఏఎల్ఎం)
విచారణ అనంతరం నలుగురిపై సస్పెన్షన్ వేటు వేశారు. ప్రశాంత్, మురళి, సాయి మురళి సర్వీసుల నుంచి శాశ్వతంగా తొలగించినట్లు సమాచారం. చంద్రమౌళికి టెర్మినేషన్ ఉత్తర్వులు జారీ చేశారు.
విద్యుత్ సరఫరా వంటి అత్యవసర సేవల్లో పనిచేసే సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉండగా, విధుల సమయంలో నిర్లక్ష్యం వహించడం పట్ల అధికారులు తీవ్రంగా స్పందించారు. ప్రజలకు నిరంతర విద్యుత్ సేవలు అందించడంలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా క్రమశిక్షణ పాటించాలని స్పష్టం చేశారు.
