Thursday, 16 July 2026
  • Home  
  • శ్రీకాళహస్తిలో ముద్రగడ పద్మనాభం విగ్రహ ప్రతిష్ట-మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి
- తిరుపతి

శ్రీకాళహస్తిలో ముద్రగడ పద్మనాభం విగ్రహ ప్రతిష్ట-మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి

శ్రీ కాళహస్తి, జులై 15, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణంలోని వైయస్సార్ సర్కిల్ వద్ద ముద్రగడ పద్మనాభం సంతాప సభ భక్తిశ్రద్ధలతో జరిగింది. దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ నివాళి కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని, ముద్రగడ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి శ్రద్ధాంజలి అర్పించారు. ఈ సందర్భంగా బియ్యపు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ…..ముద్రగడ పద్మనాభం నిస్వార్థ ప్రజాసేవకు, పౌరుషానికి నిలువెత్తు రూపమని కొనియాడారు. పదవుల కంటే ప్రజా శ్రేయస్సుకే ప్రాధాన్యతనిస్తూ, వెనుకబడిన వర్గాల, పేదల రిజర్వేషన్ల సాధన కోసం జీవితాంతం పోరాడారని గుర్తుచేశారు. రాజకీయాల్లో విలువలు కాపాడుకుంటూ, ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు, నీలం సంజీవరెడ్డి వంటి దిగ్గజాలతో సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలబడ్డారని ప్రశంసించారు. శ్రీకాళహస్తిలో గతంలో శ్రీకృష్ణదేవరాయలు, వంగవీటి మోహన రంగా విగ్రహాలను ఏర్పాటు చేశామని, త్వరలోనే మూడవ విగ్రహంగా ముద్రగడ పద్మనాభం విగ్రహాన్ని కూడా వైభవంగా ప్రతిష్టించనున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు. దక్షిణ భారతదేశంలో రంగా తర్వాత అంతటి ప్రజాదరణ పొందిన ఏకైక నాయకుడు ముద్రగడ అని, కాంగ్రెస్ హయాంలోనే ఆయనకు ముఖ్యమంత్రి అయ్యే అర్హతలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆయన అంతిమయాత్రలో వైయస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా పాడె మోసిన దృశ్యం రాష్ట్ర ప్రజలను కన్నీళ్లతో ముంచెత్తిందని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల గుండెల్లో ఆయనకు ప్రత్యేక స్థానం ఉందని భావోద్వేగంతో పంచుకున్నారు. ఉపాధ్యాయుల నుంచి పాఠాలు నేర్చుకున్నట్లుగా, ముద్రగడ జీవితం నుంచి ప్రతి ఒక్కరూ నిజాయితీ అనే గొప్ప గుణాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ, ఐదు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎంపీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవలు అందించిన ముద్రగడ మరణం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి, లక్షలాది మంది అభిమానులకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కాపు సామాజికవర్గ సంక్షేమానికి పెద్దదిక్కుగా ఉంటూ అలుపెరగని పోరాటం చేశారని శ్లాఘించారు. ఆత్మగౌరవం, పౌరుషం కలిగిన అరుదైన నాయకుడిని కోల్పోవడం బాధాకరమంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఈ శ్రద్ధాంజలి కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.