Sunday, 12 July 2026
  • Home  
  • వైరా సమగ్ర అభివృద్ధికి రూ.411 కోట్లకు పైగా నిధులు – ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్…
- ఖమ్మం

వైరా సమగ్ర అభివృద్ధికి రూ.411 కోట్లకు పైగా నిధులు – ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్…

వైరా సమగ్ర అభివృద్ధికి రూ.411 కోట్లకు పైగా నిధులు – ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్… జులై 12 ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి గుగులోత్ భావుసింగ్ నాయక్ వైరా: వైరా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో గౌరవ శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ మాట్లాడుతూ, వైరా మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలో వైరా మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.53.82 కోట్ల నిధులను మంజూరు చేసిందని తెలిపారు. అలాగే వైరా పట్టణంలో సుమారు రూ.50 కోట్ల వ్యయంతో 100 పడకల ఆధునిక ఆసుపత్రి నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. విద్యారంగ అభివృద్ధిలో భాగంగా రూ.200 కోట్ల వ్యయంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం జరుగుతోందని వెల్లడించారు. వైరా మున్సిపాలిటీ అభివృద్ధి కోసం అదనంగా రూ.15 కోట్ల నిధులు మంజూరు చేయించామని, రింగ్ రోడ్డు, రిజర్వాయర్ సెంటర్ లైటింగ్, డ్రైనేజీ పనుల కోసం రూ.1.5 కోట్లు కేటాయించి పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. లాలాపురం నుండి వైరా వరకు రూ.5 కోట్లతో నిర్మించిన రహదారిని ప్రజలకు అంకితం చేసినట్లు పేర్కొన్నారు. రింగ్ రోడ్డు సెంటర్ నుంచి గ్రీన్‌ఫీల్డ్ హైవే వరకు సుమారు రూ.12 కోట్ల వ్యయంతో రోడ్ల విస్తరణ, సెంటర్ డివైడర్ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, త్వరలో పూర్తవుతాయని తెలిపారు. గంటలపాడు నుంచి సాయిబాబా టెంపుల్ మెయిన్ రోడ్డు వరకు రూ.5 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు. వ్యవసాయ మార్కెట్ యార్డ్ అభివృద్ధికి రూ.3 కోట్లు, ఇంటిగ్రేటెడ్ మండల అధికారుల కార్యాలయ సముదాయం నిర్మాణానికి రూ.10 కోట్లు, మెయిన్ రోడ్డులో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి రూ.7.5 కోట్లు మంజూరు చేయించినట్లు తెలిపారు. వైరా జూనియర్ కళాశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి రూ.4 కోట్లు, గ్రంథాలయ అభివృద్ధికి దాదాపు రూ.1 కోటి నిధులు కేటాయించినట్లు వెల్లడించారు. అమృత్ పథకం కింద రూ.26 కోట్లతో వాటర్ ట్యాంకులు, పైప్‌లైన్ వ్యవస్థను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. వైరాకు ప్రత్యేకంగా డీఈ విద్యుత్ కార్యాలయం, వీఆర్వో కార్యాలయం, సబ్‌స్టేషన్ నిర్మాణం కోసం సుమారు రూ.5 కోట్ల నిధులు సమకూర్చి త్వరలో పనులు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ఇందిరమ్మ కాలనీలో సోమవారం చెరువు పొంగిపొర్లే సమయంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను శాశ్వతంగా పరిష్కరించేందుకు రూ.6 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు ప్రారంభించినట్లు తెలిపారు. గత మూడేళ్ల కాలంలో వైరా మున్సిపాలిటీ అభివృద్ధికి మొత్తం రూ.411 కోట్లకు పైగా నిధులు తీసుకువచ్చామని ఎమ్మెల్యే తెలిపారు. పేదల సంక్షేమం కోసం మొదటి విడతలోనే 500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయడంతో పాటు, 2,000కు పైగా రేషన్ కార్డులను అర్హులైన నిరుపేదలకు అందించామని చెప్పారు. ప్రజల వైద్య అవసరాల కోసం సీఎంఆర్‌ఎఫ్ ద్వారా దాదాపు రూ.3 కోట్ల ఆర్థిక సహాయం అందించినట్లు, అలాగే ఎల్‌ఓసీల రూపంలో మరో రూ.3 కోట్ల మేర వైద్య సహాయం అందించినట్లు తెలిపారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద 400కు పైగా చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. వైరా పట్టణ సుందరీకరణలో భాగంగా అయ్యప్పస్వామి ఆలయం నుంచి తల్లాడ రోడ్డు బాటిలింగ్ యూనిట్ వరకు, అలాగే రింగ్ రోడ్డు సెంటర్ నుంచి మార్కెట్ యార్డ్ వరకు ఫుట్‌పాత్ నిర్మాణానికి రూ.10 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. కమ్మ కళ్యాణ మండపం నుంచి బాటిలింగ్ యూనిట్ వరకు బీటీ రోడ్డు, ఫుట్ పాత్ ప్రతిపాదనల కోసం రూ.10 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. వైరా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పాలిటెక్నిక్ కళాశాల మంజూరు చేయించామని, యువత క్రీడా ప్రోత్సాహం కోసం మినీ స్టేడియం ప్రతిపాదనలు కూడా ప్రభుత్వానికి పంపించినట్లు తెలిపారు. గత మూడేళ్లలో వైరాకు ఎన్నడూ లేనంతగా అభివృద్ధి నిధులు తీసుకువచ్చి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని, వైరా సుందరీకరణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావడం గర్వకారణమని ఎమ్మెల్యే శ్రీ మాలోత్ రాందాస్ నాయక్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సుడా ఛైర్మన్ శ్రీ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, మున్సిపల్ చైర్మన్ శ్రీమతి డాక్టర్ కాపా చంద్రకళ, వైస్ చైర్మన్ కట్ల సంతోష్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు శీలం వెంకట నర్సిరెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఏదునూరి సీతారాములు, డాక్టర్ సెల్ అధ్యక్షులు డాక్టర్ మురళీకృష్ణ, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దాసరి డానియలు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బీడీకే రత్నం, సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు శీలం చంద్రశేఖర్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ నాయకులు వీరంశెట్టి సీతారాములు, కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి పమ్మి అశోక్, కౌన్సిలర్స్ పణితి సైదులు, మోర్ శ్రీకాంత్, ధీరావత్ వెంకటేశ్వర్లు, వేముల రత్నాకర్, ఉండ్రు శ్యాంబాబు, మిట్టపల్లి నాగి, గోరంట్ల పిచ్చారావు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాలేటి నరసింహారావు, పెద్దపోలు లక్ష్మయ్య, గరిడేపల్లి వెంకటేశ్వర్లు, జవ్వాజి అశ్విని నాగరాజు, బండారు నాగరాజు, షేక్ బాబ్జాని, భిక్యా, భూక్య బాలాజీ, గూడూరు శేషరెడ్డి, కంభంపాటి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు….

వైరా సమగ్ర అభివృద్ధికి రూ.411 కోట్లకు పైగా నిధులు – ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్…

జులై 12 ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి గుగులోత్ భావుసింగ్ నాయక్

వైరా:
వైరా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో గౌరవ శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ మాట్లాడుతూ, వైరా మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు.

ఈ క్రమంలో వైరా మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.53.82 కోట్ల నిధులను మంజూరు చేసిందని తెలిపారు. అలాగే వైరా పట్టణంలో సుమారు రూ.50 కోట్ల వ్యయంతో 100 పడకల ఆధునిక ఆసుపత్రి నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. విద్యారంగ అభివృద్ధిలో భాగంగా రూ.200 కోట్ల వ్యయంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం జరుగుతోందని వెల్లడించారు.

వైరా మున్సిపాలిటీ అభివృద్ధి కోసం అదనంగా రూ.15 కోట్ల నిధులు మంజూరు చేయించామని, రింగ్ రోడ్డు, రిజర్వాయర్ సెంటర్ లైటింగ్, డ్రైనేజీ పనుల కోసం రూ.1.5 కోట్లు కేటాయించి పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. లాలాపురం నుండి వైరా వరకు రూ.5 కోట్లతో నిర్మించిన రహదారిని ప్రజలకు అంకితం చేసినట్లు పేర్కొన్నారు.

రింగ్ రోడ్డు సెంటర్ నుంచి గ్రీన్‌ఫీల్డ్ హైవే వరకు సుమారు రూ.12 కోట్ల వ్యయంతో రోడ్ల విస్తరణ, సెంటర్ డివైడర్ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, త్వరలో పూర్తవుతాయని తెలిపారు. గంటలపాడు నుంచి సాయిబాబా టెంపుల్ మెయిన్ రోడ్డు వరకు రూ.5 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు.

వ్యవసాయ మార్కెట్ యార్డ్ అభివృద్ధికి రూ.3 కోట్లు, ఇంటిగ్రేటెడ్ మండల అధికారుల కార్యాలయ సముదాయం నిర్మాణానికి రూ.10 కోట్లు, మెయిన్ రోడ్డులో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి రూ.7.5 కోట్లు మంజూరు చేయించినట్లు తెలిపారు. వైరా జూనియర్ కళాశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి రూ.4 కోట్లు, గ్రంథాలయ అభివృద్ధికి దాదాపు రూ.1 కోటి నిధులు కేటాయించినట్లు వెల్లడించారు.

అమృత్ పథకం కింద రూ.26 కోట్లతో వాటర్ ట్యాంకులు, పైప్‌లైన్ వ్యవస్థను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. వైరాకు ప్రత్యేకంగా డీఈ విద్యుత్ కార్యాలయం, వీఆర్వో కార్యాలయం, సబ్‌స్టేషన్ నిర్మాణం కోసం సుమారు రూ.5 కోట్ల నిధులు సమకూర్చి త్వరలో పనులు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.

ఇందిరమ్మ కాలనీలో సోమవారం చెరువు పొంగిపొర్లే సమయంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను శాశ్వతంగా పరిష్కరించేందుకు రూ.6 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు ప్రారంభించినట్లు తెలిపారు.

గత మూడేళ్ల కాలంలో వైరా మున్సిపాలిటీ అభివృద్ధికి మొత్తం రూ.411 కోట్లకు పైగా నిధులు తీసుకువచ్చామని ఎమ్మెల్యే తెలిపారు. పేదల సంక్షేమం కోసం మొదటి విడతలోనే 500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయడంతో పాటు, 2,000కు పైగా రేషన్ కార్డులను అర్హులైన నిరుపేదలకు అందించామని చెప్పారు.

ప్రజల వైద్య అవసరాల కోసం సీఎంఆర్‌ఎఫ్ ద్వారా దాదాపు రూ.3 కోట్ల ఆర్థిక సహాయం అందించినట్లు, అలాగే ఎల్‌ఓసీల రూపంలో మరో రూ.3 కోట్ల మేర వైద్య సహాయం అందించినట్లు తెలిపారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద 400కు పైగా చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసినట్లు వెల్లడించారు.

వైరా పట్టణ సుందరీకరణలో భాగంగా అయ్యప్పస్వామి ఆలయం నుంచి తల్లాడ రోడ్డు బాటిలింగ్ యూనిట్ వరకు, అలాగే రింగ్ రోడ్డు సెంటర్ నుంచి మార్కెట్ యార్డ్ వరకు ఫుట్‌పాత్ నిర్మాణానికి రూ.10 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. కమ్మ కళ్యాణ మండపం నుంచి బాటిలింగ్ యూనిట్ వరకు బీటీ రోడ్డు, ఫుట్ పాత్ ప్రతిపాదనల కోసం రూ.10 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు.

వైరా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పాలిటెక్నిక్ కళాశాల మంజూరు చేయించామని, యువత క్రీడా ప్రోత్సాహం కోసం మినీ స్టేడియం ప్రతిపాదనలు కూడా ప్రభుత్వానికి పంపించినట్లు తెలిపారు.

గత మూడేళ్లలో వైరాకు ఎన్నడూ లేనంతగా అభివృద్ధి నిధులు తీసుకువచ్చి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని, వైరా సుందరీకరణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావడం గర్వకారణమని ఎమ్మెల్యే శ్రీ మాలోత్ రాందాస్ నాయక్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సుడా ఛైర్మన్ శ్రీ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, మున్సిపల్ చైర్మన్ శ్రీమతి డాక్టర్ కాపా చంద్రకళ, వైస్ చైర్మన్ కట్ల సంతోష్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు శీలం వెంకట నర్సిరెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఏదునూరి సీతారాములు, డాక్టర్ సెల్ అధ్యక్షులు డాక్టర్ మురళీకృష్ణ, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దాసరి డానియలు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బీడీకే రత్నం, సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు శీలం చంద్రశేఖర్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ నాయకులు వీరంశెట్టి సీతారాములు, కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి పమ్మి అశోక్, కౌన్సిలర్స్ పణితి సైదులు, మోర్ శ్రీకాంత్, ధీరావత్ వెంకటేశ్వర్లు, వేముల రత్నాకర్, ఉండ్రు శ్యాంబాబు, మిట్టపల్లి నాగి, గోరంట్ల పిచ్చారావు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాలేటి నరసింహారావు, పెద్దపోలు లక్ష్మయ్య, గరిడేపల్లి వెంకటేశ్వర్లు, జవ్వాజి అశ్విని నాగరాజు, బండారు నాగరాజు, షేక్ బాబ్జాని, భిక్యా, భూక్య బాలాజీ, గూడూరు శేషరెడ్డి, కంభంపాటి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు….

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.