వార్త ముఖ్యాంశాలు
- శ్రీ కాళహస్తి, సెప్టెంబర్ 02, (పున్నమి న్యూస్): దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.
- రాజశేఖర రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణంలోని వైయస్సార్ సర్కిల్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి సతీమణి బియ్యపు శ్రీవాణి రెడ్డి, వైఎస్ఆర్సిపి నాయకులు, శ్రేణులు పాలాభిషేకం చేసి, పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
- ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ….దివంగత నేత వైఎస్సార్ ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయారని, ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలు నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపాయని కొనియాడారు.
శ్రీ కాళహస్తి, సెప్టెంబర్ 02, (పున్నమి న్యూస్): దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణంలోని వైయస్సార్ సర్కిల్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి సతీమణి బియ్యపు శ్రీవాణి రెడ్డి, వైఎస్ఆర్సిపి నాయకులు, శ్రేణులు పాలాభిషేకం చేసి, పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ….దివంగత నేత వైఎస్సార్ ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయారని, ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలు నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపాయని కొనియాడారు. పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకుని ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, పక్కా గృహాల వంటి విప్లవాత్మక పథకాలతో సీఎంగా సువర్ణ పాలన అందించారని గుర్తుచేశారు. ఆయన చూపిన బాటలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం ప్రజలకు అండగా నిలుస్తూ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపారని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్నం వాసుదేవ నాయుడు, శ్రీకాళహస్తి దేవస్థానం మాజీ బోర్డు సభ్యులు మున్నా రాయల్, పగడాల రాజు, కొత్తపాటి శ్రీనివాసులు రెడ్డి, యూత్ ప్రెసిడెంట్ సూర సురేష్ రాయల్, ఉత్తరాజి శరవణ కుమార్, కామి వెంకటేశ్వరులు, చందర్ రాజు, బుల్లెట్ జయశ్యామ్, శ్రీకాళహస్తి టౌన్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు పఠాన్ ఫరీద్, గోరా, కంట ఉదయ్ కుమార్, సెన్నీకుప్పం శేఖర్, తొట్టంబేడు మండల ప్రెసిడెంట్ డాక్టర్ సుబ్రహ్మణ్యం, హరి నాయుడు, మెహబూబ్ బాషా, పులి రామచంద్ర, అస్లాం, ఆర్కాడు ముత్తు, పెరుమాళ్, జుంలేష, లీలా కుమార్, బలిశెట్టి శేఖర్, మణి నాయుడు, మునీకృష్ణ రెడ్డి, జయకృష్ణ రెడ్డి, డాక్టర్ శివ శంకర్, సాదిక్, కొట్టే శరవణ, SC సెల్ అధ్యక్షుడు పసల కృష్ణయ్య, జీలాని, వెంకటేశ్వరులు నాయుడు, బ్రాహ్మయ్య, కామి మనోహర్, అబ్బు, షబ్బీర్, ఆరీఫ్, బావాజీ, అబ్దుల్, షరీఫ్, గౌస్ బాషా, పసల సుమతి, షర్మిల ఠాగూర్, మాధవి, సాగిర బీ, సునీత సింగ్, ప్రకాష్, అప్పిని సుధాకర్, CRT ప్రసాద్, చింత రాజేంద్ర, GVK రెడ్డి, తమీమ్, కిరణ్, ఖాదర్ వళ్లి, కుమార్, రంగయ్య, సతీష్, ఫిరోజ్, నారాయణ, మణి, భారతమ్మ, మణికంఠ, పసల యుగంధర్, పాండు, నజీర్, యాకూబ్, దినేష్ రెడ్డి తదితర వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు విశేషంగా పాల్గొన్నారు.