తాడేపల్లి …
ది. 25 -09- 2026 (శుక్రవారం) …
*➖ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల పై “రౌడీ” అనే ముద్ర వేయాలని కూటమి ప్రభుత్వం చూస్తుంది : MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు …*
🔥 అక్రమ కేసులకు – అక్రమ అరెస్టు లకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడదు : MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు …
*▪️తాడేపల్లి లోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నేతలతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించిన శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు …*
డీఎస్సీలో జరిగిన అవకతవకలపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతో కాలంగా ప్రశ్నిస్తుంది… సిబిఐ తో విచారణ చేయించాలని డిమాండ్ చేస్తుంది.. అందులో భాగంగానే మొన్న విజయవాడ లోని శాప్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది …
*⚫ ఆ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ నాయకులపై, కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి… గత మూడు రోజులుగా వారి ఇళ్లకు వెళ్లి అక్రమ అరెస్టులు చేస్తూ … వారిని వారి కుటుంబాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు …*
📝 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు, హత్యాయత్నం కేసులు నమోదు చేసి… విజయవాడలోని మూడు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఐదు కేసులు నమోదుచేసి… 30 మందిని కోర్టుకు హాజరు పరిచితే… 28 మందికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది… అయినప్పటికీ ఇంకా వేధింపులకు గురి చేయాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ఆదేశాలతో పోలీసులు వైసీపీ నాయకులు, కార్యకర్తలను వెంటాడుతున్నారు …
*◾రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో… ఓటమి భయంతో తెలుగుదేశం పార్టీ… స్థానికంగా బలంగా ఉన్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను భయభ్రాంతులకు గురి చేద్దాం అనే ఉద్దేశంతో… యాక్టివ్ గా ఉన్న నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేస్తూ… ఎలాగైనా వారిని జైలుకు పంపాలనే కుట్రలు చేస్తున్నారు …*
➖ తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం చేస్తున్న ఇటువంటి దుశ్చర్యలను రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు… కేవలం నిరసన కార్యక్రమాలు, ధర్నాల్లో పాల్గొన్న వ్యక్తులపై రౌడీషీట్లు నమోదు చేస్తామని బెదిరింపులకు దిగుతున్నారు…
*చంద్రబాబు, లోకేష్ లు చేయిస్తున్న దుర్మార్గాలకు… వ్యతిరేకంగా న్యాయపోరాటం చేస్తాం… ఈ పోరాటాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్తాం… రేపు 11 గంటలకు విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ ను… కలిసి వైసిపి నాయకులు, కార్యకర్తలపై నమోదు చేస్తున్న అక్రమ కేసులు, అరెస్టుల పై… వారికి వినతిపత్రం అందజేస్తాం …*
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే లు మల్లాది విష్ణు, టీజేఆర్ సుధాకర్ బాబు, అశోక్ బాబు, అన్నాబత్తుని శివప్రసాద్, వైసిపి నేతలు నూరి ఫాతిమా తదితరులు పాల్గొన్నారు …




