Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
సిద్ధిపేట

వీరారెడ్డిపల్లిలో అంబరాన్నంటిన దసరా వేడుకలు: భక్తిశ్రద్ధలతో ఘనంగా జమ్మి పూజలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
వీరారెడ్డిపల్లిలో అంబరాన్నంటిన దసరా వేడుకలు: భక్తిశ్రద్ధలతో ఘనంగా జమ్మి పూజలు

పున్నమి ప్రతినిధి అక్బర్ పేట భూంపల్లి
అక్బర్ పేట భూంపల్లి మండల పరిధిలోని వీరారెడ్డిపల్లి గ్రామంలో విజయదశమి (దసరా) వేడుకలు అత్యంత వైభవంగా, పండుగ శోభతో అంబరాన్నంటాయి. ఊరంతా నూతన వస్త్రాలు ధరించి ఉత్సాహంగా పాల్గొన్న ఈ వేడుకల్లో, శతాబ్దాల సంప్రదాయాన్ని కొనసాగిస్తూ గ్రామ పెద్దలు, యువకులు, మహిళలంతా కలిసి జమ్మిచెట్టు వద్దకు చేరుకుని “శమీ శమయతే పాపం..” అంటూ జమ్మి వృక్షానికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఒకరికొకరు జమ్మి ఆకులను (బంగారం) మార్చుకుంటూ దసరా శుభాకాంక్షలు తెలుపగా, చిన్నలు పెద్దల ఆశీస్సులు అందుకున్నారు. గ్రామం ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండి రైతాంగం సంతోషంగా ఉండాలని దేవుడిని ప్రార్థించిన ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, గ్రామ పెద్దలు మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు.

వీరారెడ్డిపల్లిలో అంబరాన్నంటిన దసరా వేడుకలు: భక్తిశ్రద్ధలతో ఘనంగా జమ్మి పూజలు

వీరారెడ్డిపల్లిలో అంబరాన్నంటిన దసరా వేడుకలు: భక్తిశ్రద్ధలతో ఘనంగా జమ్మి పూజలు

వీరారెడ్డిపల్లిలో అంబరాన్నంటిన దసరా వేడుకలు: భక్తిశ్రద్ధలతో ఘనంగా జమ్మి పూజలు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *