మహాకవి గుర్రం జాషువా 131వ జయంతిని పురస్కరించుకుని సోమవారం మండలంలోని నాగిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, బాలికల జూనియర్ కళాశాలలో జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, అధ్యాపకులు జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నాగిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంగనపల్లి వెంకటరమణ మాట్లాడుతూ.. కులవివక్ష, సామాజిక అసమానతలు రాజ్యమేలుతున్న సమయంలో జన్మించిన గుర్రం జాషువా తన సాహిత్యంతో విశ్వనరుడిగా కీర్తి ప్రతిష్ఠలు పొందారని పేర్కొన్నారు. సమానత్వం, మానవత్వం, సామాజిక న్యాయం వంటి విలువలను తన రచనల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లారని తెలిపారు. సమసమాజ స్థాపన కోసం సాహిత్యం ద్వారా విశేష కృషి చేసిన మహాకవి జాషువా సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో తెలుగు ఉపాధ్యాయురాలు గీత, గ్లోరీ, కిరణ్, ఉజాల, రెడ్డి ప్రసాద్, రవిశంకర్ రెడ్డి, లక్ష్మీనారాయణ, వెంకటసుబ్బయ్య, ప్రసాదరావు, జ్యోతిప్రియ, ఆర్.వి. రమణమ్మ, మస్తాన్, గౌరీ, రాజేంద్ర, సురేష్, గాయత్రీ దేవి, సుమలత, తోట శివ సాయిరాం, సి. వెంకటరమణ, నాగలక్ష్మి తదితరులు పాల్గొని మహాకవి గుర్రం జాషువాకు నివాళులర్పించారు.


