వింజమూరు పట్టణంలో కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నడిమూరుకు చెందిన అక్రమ్ బాషా (40) కుటుంబ సమస్యల కారణంగా ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారని ఎస్ఐ ఉమామహేశ్వరరావు తెలిపారు. ఈ ఘటనపై ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించినట్లు చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నట్లు ఎస్ఐ తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

వింజమూరులో కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య