Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రంగారెడ్డి

వాటర్‌ ట్యాంక్‌ల మూతలు జాగ్రత్తగా ఉంచండి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
వాటర్‌ ట్యాంక్‌ల మూతలు జాగ్రత్తగా ఉంచండి

వాటర్‌ ట్యాంక్‌ల మూతలు జాగ్రత్తగా ఉంచండి

కోతులు మూతలు తీసి నీరు తాగుతున్న వైనం.. ప్రమాదాలపై గ్రామస్తులకు హెచ్చరిక

యాచారం: మేడిపల్లి గ్రామంలో కోతుల బెడద రోజురోజుకూ పెరుగుతోంది. ఇళ్లపై ఏర్పాటు చేసిన వాటర్‌ ట్యాంకుల వద్దకు చేరుకుంటున్న కోతులు వాటి మూతలను తొలగించి ట్యాంకుల్లోని నీటిని తాగుతున్నాయి. ఈ క్రమంలో పొరపాటున కోతులు వాటర్‌ ట్యాంకుల్లో పడిపోయే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్యాంకుల్లో కోతులు పడిపోవడం వల్ల నీరు కలుషితమై, ప్రజల ఆరోగ్యానికి కూడా ముప్పు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

ఈ నేపథ్యంలో గ్రామ ప్రజలు తమ ఇళ్లపై ఉన్న వాటర్‌ ట్యాంకుల మూతలను ఎప్పటికప్పుడు పరిశీలించి, బిగుతుగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని PRG ఫౌండేషన్ అధ్యక్షులు రవీందర్ గుప్త సూచించారు. ముఖ్యంగా ట్యాంకులకు బలమైన మూతలు ఏర్పాటు చేసుకోవాలని, కోతులు సులభంగా తొలగించలేని విధంగా భద్రత కల్పించాలని కోరారు.

మేడిపల్లి గ్రామంలో కోతుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో సంబంధిత ప్రభుత్వ అధికారులు స్పందించి, కోతుల నియంత్రణకు తగిన చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. కోతుల సంతానం పెరగకుండా చర్యలు తీసుకోవడంతో పాటు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

వాటర్‌ ట్యాంక్‌ల మూతలు జాగ్రత్తగా ఉంచండి

వాటర్‌ ట్యాంక్‌ల మూతలు జాగ్రత్తగా ఉంచండి

వాటర్‌ ట్యాంక్‌ల మూతలు జాగ్రత్తగా ఉంచండి

వాటర్‌ ట్యాంక్‌ల మూతలు జాగ్రత్తగా ఉంచండి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *