అనంతసాగరం సెప్టెంబర్12,పున్నమి ప్రతినిధి:
మండల కేంద్రం అనంతసాగరం బస్టాండ్ సెంటర్ వద్ద కామ్రేడ్ సీతారాం ఏచూరి ద్వితీయ వర్ధంతి కార్యక్రమం శనివారం సిపిఎం పార్టీ అనంతసాగరం మండల కమిటి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.కామ్రేడ్ సీతారాం ఏచూరి చిత్రపటానికి సిపిఎం పార్టీ మండల కమిటి సభ్యులు డాక్టర్ సుబ్బారాయుడు, గాడి సుధాకర్ పూలమాల వేసినారు.పార్టీ సభ్యులు అందరూ పూలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి అన్వర్ బాషా మాట్లాడుతూ
కామ్రేడ్ సీతారాం ఏచూరి నిర్యాణమై అప్పుడే రెండు సంవత్సరాలు అయ్యిందనీ దేశ రాజకీయ రంగంలో ఆయనలేని వెలితి స్పష్టంగా కన్పిస్తున్నదనీ అన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ సభ్యులు వేము పెంచలయ్య, సందాని, వెంకటేష్, వంశీ, నరసింహులు, బాబు, పాల్గొన్నారు.


