Wednesday, 30 September 2026
  • Home  
  • లారీ–ద్విచక్ర వాహనంఢీ.. ఇద్దరికి గాయాలు*
- చిత్తూరు

లారీ–ద్విచక్ర వాహనంఢీ.. ఇద్దరికి గాయాలు*

*లారీ–ద్విచక్ర వాహనంఢీ.. ఇద్దరికి గాయాలు* పలమనేరు సెప్టెంబర్29 ( పున్నమి ప్రతినిధి ) బైరెడ్డిపల్లి మండలంలోని నాలుగు రోడ్ల కూడలి సమీపంలో వీకోట రహదారిపై మంగళవారం లారీ, ద్విచక్ర వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. జంగాల అగ్రహారం గ్రామానికి చెందిన ప్రదీప్‌ (35), రాజేష్‌ (38) ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టినట్లు సమాచారం.ఈప్రమాదంలో ప్రదీప్‌కు తలకు బలమైన గాయం కాగా, రాజేష్‌కు ఎడమ కాలుతో పాటు శరీరంపై రక్తగాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను బైరెడ్డిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వైద్యులు ప్రాథమిక చికిత్స అనంతరం పరిస్థితిని పరిశీలించి మెరుగైన వైద్యం కోసం పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది.ప్రమాదంతో రహదారిపై ఇరువైపులా వాహనాలు నిలిచిపోవడంతో స్థానికులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. లారీ డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడిపినట్లు ఆరోపణలు రావడంతో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

*లారీ–ద్విచక్ర వాహనంఢీ.. ఇద్దరికి గాయాలు*

పలమనేరు సెప్టెంబర్29 ( పున్నమి ప్రతినిధి )

బైరెడ్డిపల్లి మండలంలోని నాలుగు రోడ్ల కూడలి సమీపంలో వీకోట రహదారిపై మంగళవారం లారీ, ద్విచక్ర వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. జంగాల అగ్రహారం గ్రామానికి చెందిన ప్రదీప్‌ (35), రాజేష్‌ (38) ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టినట్లు సమాచారం.ఈప్రమాదంలో ప్రదీప్‌కు తలకు బలమైన గాయం కాగా, రాజేష్‌కు ఎడమ కాలుతో పాటు శరీరంపై రక్తగాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను బైరెడ్డిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వైద్యులు ప్రాథమిక చికిత్స అనంతరం పరిస్థితిని పరిశీలించి మెరుగైన వైద్యం కోసం పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది.ప్రమాదంతో రహదారిపై ఇరువైపులా వాహనాలు నిలిచిపోవడంతో స్థానికులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. లారీ డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడిపినట్లు ఆరోపణలు రావడంతో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.