అనకాపల్లి జిల్లా, ఆగస్టు 2 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్):
ఎలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామానికి చెందిన జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డు గ్రహీత హస్తకళాకారుడు లక్కోజు నాగేశ్వరరావు రూపొందించిన ఏటికొప్పాక కళారూపాల డెమో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ముఖద్వారంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఏటికొప్పాకను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తే హస్తకళాకారులకు మరింత గుర్తింపు, ఉపాధి లభిస్తుందని నాగేశ్వరరావు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్, జనసేన మండల అధ్యక్షుడు అన్నం బాబ్జి, తోటి కళాకారులు, గ్రామ పెద్దలు, ప్రజలు ఆయనను అభినందించారు.

లక్కోజు నాగేశ్వరరావు కళా ప్రతిభకు అంతర్జాతీయ విమానాశ్రయంలో అరుదైన గౌరవం
అనకాపల్లి జిల్లా, ఆగస్టు 2 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): ఎలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామానికి చెందిన జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డు గ్రహీత హస్తకళాకారుడు లక్కోజు నాగేశ్వరరావు రూపొందించిన ఏటికొప్పాక కళారూపాల డెమో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ముఖద్వారంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఏటికొప్పాకను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తే హస్తకళాకారులకు మరింత గుర్తింపు, ఉపాధి లభిస్తుందని నాగేశ్వరరావు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్, జనసేన మండల అధ్యక్షుడు అన్నం బాబ్జి, తోటి కళాకారులు, గ్రామ పెద్దలు, ప్రజలు ఆయనను అభినందించారు.

