కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 279వ డివిజన్ శ్రీరామ్ నగర్–బి రోడ్డు, మేస్త్రీ నగర్ ప్రాంతాల్లో 8, 9, 10, 11, 12వ వీధుల్లో రోడ్ల దుస్థితి కారణంగా ప్రజల రాకపోకలకు, చిన్నారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న విషయాన్ని స్థానికులు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకువచ్చారు.
ప్రజల సమస్యపై వెంటనే స్పందించిన ఐటీ శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారి సహకారంతో, CMC నిధుల ద్వారా రూ.60 లక్షల వ్యయంతో రోడ్డు అభివృద్ధి పనులు చేపట్టేలా చర్యలు తీసుకున్నారు. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి గారి సమక్షంలో, వారి చేతుల మీదుగా ఈ అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సిద్ధనోళ్ల సంజీవ్ రెడ్డి, డీసీసీ సెక్రటరీ లాయక్, అజయ్, జమీర్ రహీమ్, కలీమ్, గఫార్, ఖాజా రెహ్మాన్ ఖహీల్, ఎం.డి. ఖలీల్ ఉర్ రెహ్మాన్, హనీఫ్, నవీన్ గౌడ్, యాదగిరి, బుచ్చి రెడ్డి, అంజనేయులు, నరసింహాచారి, విశ్వనాథ్, ప్రభాకర్, అజాజ్, శ్రావణ్, విష్ణువర్ధన్ గౌడ్, కృష్ణ గౌడ్, ప్రభు గౌడ్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజల మౌలిక వసతుల అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోంది.



