వార్త ముఖ్యాంశాలు
- బిట్రగుంట: బిట్రగుంట రైల్వేస్టేషన్ ఉత్తర యార్డు సమీపంలో శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది.
- దిగువ మార్గంలో ప్రయాణిస్తున్న రైలు కిందపడి సుమారు 25 ఏళ్ల యువకుడు మృతిచెందాడు.సమాచారం అందుకున్న జీఆర్పీ ఎస్సై వెంకట్రావు, బిట్రగుంట ఆర్పీఎఫ్ స్టేషన్ ఇన్‌చార్జి కిరణ్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.
- ప్రాథమికంగా ఆత్మహత్య అయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
బిట్రగుంట: బిట్రగుంట రైల్వేస్టేషన్ ఉత్తర యార్డు సమీపంలో శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. దిగువ మార్గంలో ప్రయాణిస్తున్న రైలు కిందపడి సుమారు 25 ఏళ్ల యువకుడు మృతిచెందాడు.సమాచారం అందుకున్న జీఆర్పీ ఎస్సై వెంకట్రావు, బిట్రగుంట ఆర్పీఎఫ్ స్టేషన్ ఇన్‌చార్జి కిరణ్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ప్రాథమికంగా ఆత్మహత్య అయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడి వయస్సు సుమారు 25 ఏళ్లు, ఎత్తు 5.6 అడుగులు ఉండగా, నలుపు రంగు టీషర్టు, గళ్ల షార్ట్ ధరించి ఉన్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కావలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.