Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అయ్యప్ప భక్తుల కోసం ప్రత్యేక బస్సులు.. ఆర్టీసీ సేవలను వినియోగించుకోండి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అయ్యప్ప భక్తుల కోసం ప్రత్యేక బస్సులు.. ఆర్టీసీ సేవలను వినియోగించుకోండి

వార్త ముఖ్యాంశాలు

  • ఉదయగిరి: శబరిమల యాత్రకు వెళ్లే అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక రవాణా సదుపాయాలు కల్పిస్తోందని రీజినల్ మేనేజర్ షేక్ షమీమ్ తెలిపారు.
  • శనివారం ఉదయగిరి ఆర్టీసీ డిపోను సందర్శించిన ఆమె బస్సుల పనితీరు, నిర్వహణ పరిస్థితులను పరిశీలించి, వాహనాల మరమ్మతులు, భద్రత విషయంలో సిబ్బందికి పలు సూచనలు చేశారు.
  • ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..

ఉదయగిరి: శబరిమల యాత్రకు వెళ్లే అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక రవాణా సదుపాయాలు కల్పిస్తోందని రీజినల్ మేనేజర్ షేక్ షమీమ్ తెలిపారు. శనివారం ఉదయగిరి ఆర్టీసీ డిపోను సందర్శించిన ఆమె బస్సుల పనితీరు, నిర్వహణ పరిస్థితులను పరిశీలించి, వాహనాల మరమ్మతులు, భద్రత విషయంలో సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాకు త్వరలో 100 విద్యుత్ బస్సులు రానున్నాయని, వాటిలో 12 బస్సులను ఉదయగిరి డిపోకు కేటాయించనున్నట్లు వెల్లడించారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని పంచారామ క్షేత్రాల దర్శనం కోసం ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. అయ్యప్ప భక్తులు కోరితే అద్దె ప్రాతిపదికన కూడా బస్సులు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.కార్యక్రమంలో డిపో మేనేజర్ రమేష్ కుమార్, సీఐ నాగభూషణం, ఏఎంఎఫ్ నారాయణ, రమణయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *