Sunday, 31 May 2026
  • Home  
  • రైతుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తాం : మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
- News - ఆంధ్రప్రదేశ్ - శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రైతుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తాం : మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

ఆత్మకూరు , మే 31 (హరికిరణ్, పున్నమి ప్రతినిధి): పొగాకు రైతుల సమస్యలను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా పరిగణిస్తోందని, వారికి గిట్టుబాటు ధర కల్పించి అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి, ఆత్మకూరు ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి స్పష్టం చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వం అండగా ఉంటుందని, వారి సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.ఆదివారం నెల్లూరు నగరంలోని సంతపేటలో ఉన్న తన క్యాంపు కార్యాలయంలో జిల్లాలోని పలువురు పొగాకు రైతులు, రైతు ప్రతినిధులు మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు. పొగాకు కొనుగోళ్లు మందగించడం, వేలం ధరలు గణనీయంగా తగ్గిపోవడంతో తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ పంటకు గిట్టుబాటు ధర కల్పించేలా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు.రైతుల సమస్యలను విన్న మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెంటనే స్పందించి, రైతుల సమక్షంలోనే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్, జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాతో ఫోన్‌లో మాట్లాడారు. రైతులకు ఎదురవుతున్న సమస్యలను వివరించి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆత్మకూరు నియోజకవర్గంలోని డీసీపల్లి, ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి టొబాకో బోర్డు వేలం కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఉదయగిరి, కావలి, ఆత్మకూరు ప్రాంతాల్లో వేలాది మంది రైతులు పొగాకు సాగుపై ఆధారపడి జీవిస్తున్నారని, ఈ ఏడాది అనుకూల వాతావరణంతో నాణ్యమైన పంట పండించినప్పటికీ ధరలు పడిపోవడం రైతులను తీవ్ర నిరాశకు గురిచేస్తోందన్నారు.నెల్లూరు జిల్లాలో సుమారు 45 వేల ఎకరాల్లో పొగాకు సాగు జరుగుతుండగా, నాలుగు వేల మందికి పైగా రైతులు ఈ పంటపై ఆధారపడి ఉన్నారని పేర్కొన్నారు. గత ఏడాది కిలో పొగాకు ధర రూ.280 నుంచి రూ.360 వరకు పలికిందని, ప్రస్తుతం డీసీపల్లి, కలిగిరి వేలం కేంద్రాల్లో ధరలు రూ.190 వరకు పడిపోవడం రైతులకు తీవ్ర నష్టాన్ని మిగులుస్తోందన్నారు.పొగాకు కొనుగోళ్లలో రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్‌కు సూచించినట్లు తెలిపారు. గిడ్డంగుల కొరత, నిల్వ సమస్యలు, మార్కెటింగ్ ఇబ్బందుల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు చెప్పారు.రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ సమస్యను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లిందని, రాష్ట్రంలోని పొగాకు రైతులకు న్యాయం చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి కేంద్ర వాణిజ్య శాఖ, ఆర్థిక శాఖ మంత్రులకు లేఖ రాసినట్లు మంత్రి వెల్లడించారు.త్వరలోనే పొగాకు రైతు ప్రతినిధులు, టొబాకో బోర్డు అధికారులు, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి సమస్యలపై సమగ్రంగా చర్చించనున్నట్లు తెలిపారు. ఆ సమావేశానికి నెల్లూరు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, రైతు సంఘాల ప్రతినిధులను కూడా ఆహ్వానిస్తామని పేర్కొన్నారు.పొగాకు రైతులకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వం వారి పక్షాన నిలుస్తుందని, ప్రతి రైతును ఆదుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పునరుద్ఘాటించారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం వారి సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉందని భరోసా ఇచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.