పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందకపోవడం వల్ల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే రాష్ట్ర రైతులు రూ.25 వేల కోట్ల మేర నష్టపోయారని నెల్లూరు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ముఖ్యమంత్రి నాలుగోసారి బాధ్యతలు చేపట్టినప్పటికీ వ్యవసాయం పట్ల దృష్టిలో మార్పు రాలేదని, ఇప్పటికీ “వ్యవసాయం దండగ” అనే విధానంతోనే పాలన కొనసాగుతోందని ఆరోపించారు. గడిచిన ఏడాది పత్తి, పొగాకు, మిర్చి పంటలు సాగు చేసిన రైతులు ఎకరాకు రూ.5 లక్షల వరకు నష్టపోయారని, ప్రభుత్వ సూచనతో మొక్కజొన్న పంటలు వేసినా సరైన మద్దతు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు.
మొక్కజొన్న రైతులు ఎకరాకు రూ.50 వేల వరకు పెట్టుబడి పెట్టి సాగుచేసినా, ఎకరాకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు నష్టపోతున్నారని చెప్పారు. కూరగాయలు, పండ్ల తోటల పరిస్థితి కూడా దారుణంగా మారిందని, కోత ఖర్చులు కూడా రాక పంటలను పొలాల్లోనే వదిలేయాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.
రైతులు ఇబ్బందులు పడుతుంటే మంత్రులు విదేశీ పర్యటనల్లో జల్సాలు చేస్తున్నారని విమర్శించారు. మద్దతు ధర ప్రకటించడమే తప్ప ఆ ధరకు కొనుగోళ్లు జరుగుతున్నాయో లేదో ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. కేంద్రానికి లేఖలు రాసి బాధ్యత నుంచి తప్పించుకుంటోందని ఆరోపించారు.
వైఎస్సార్సీపీ ప్రభుత్వ కాలంలో ధరల స్థిరీకరణ నిధి, ఆర్బీకే కేంద్రాల ద్వారా కొనుగోళ్లు, మార్క్‌ఫెడ్ ద్వారా పోటీ వాతావరణం సృష్టించి రైతులను ఆదుకున్నామని తెలిపారు. ప్రస్తుతం ఆ వ్యవస్థలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు.
తక్షణం రైతులకు మద్దతు ధరలు కల్పించి ఆదుకోకపోతే వైఎస్సార్సీపీ ఉద్యమాలు చేపట్టి ప్రభుత్వానికి బుద్ధి చెబుతుందని కాకాణి గోవర్ధన్ రెడ్డి హెచ్చరించారు.

రెండేళ్లలో రైతులకు రూ.25 వేల కోట్ల నష్టం – గిట్టుబాటు ధరల కోసం వైఎస్సార్సీపీ పోరాటం: కాకాణి గోవర్ధన్ రెడ్డి
పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందకపోవడం వల్ల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే రాష్ట్ర రైతులు రూ.25 వేల కోట్ల మేర నష్టపోయారని నెల్లూరు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి నాలుగోసారి బాధ్యతలు చేపట్టినప్పటికీ వ్యవసాయం పట్ల దృష్టిలో మార్పు రాలేదని, ఇప్పటికీ “వ్యవసాయం దండగ” అనే విధానంతోనే పాలన కొనసాగుతోందని ఆరోపించారు. గడిచిన ఏడాది పత్తి, పొగాకు, మిర్చి పంటలు సాగు చేసిన రైతులు ఎకరాకు రూ.5 లక్షల వరకు నష్టపోయారని, ప్రభుత్వ సూచనతో మొక్కజొన్న పంటలు వేసినా సరైన మద్దతు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. మొక్కజొన్న రైతులు ఎకరాకు రూ.50 వేల వరకు పెట్టుబడి పెట్టి సాగుచేసినా, ఎకరాకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు నష్టపోతున్నారని చెప్పారు. కూరగాయలు, పండ్ల తోటల పరిస్థితి కూడా దారుణంగా మారిందని, కోత ఖర్చులు కూడా రాక పంటలను పొలాల్లోనే వదిలేయాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. రైతులు ఇబ్బందులు పడుతుంటే మంత్రులు విదేశీ పర్యటనల్లో జల్సాలు చేస్తున్నారని విమర్శించారు. మద్దతు ధర ప్రకటించడమే తప్ప ఆ ధరకు కొనుగోళ్లు జరుగుతున్నాయో లేదో ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. కేంద్రానికి లేఖలు రాసి బాధ్యత నుంచి తప్పించుకుంటోందని ఆరోపించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ కాలంలో ధరల స్థిరీకరణ నిధి, ఆర్బీకే కేంద్రాల ద్వారా కొనుగోళ్లు, మార్క్‌ఫెడ్ ద్వారా పోటీ వాతావరణం సృష్టించి రైతులను ఆదుకున్నామని తెలిపారు. ప్రస్తుతం ఆ వ్యవస్థలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. తక్షణం రైతులకు మద్దతు ధరలు కల్పించి ఆదుకోకపోతే వైఎస్సార్సీపీ ఉద్యమాలు చేపట్టి ప్రభుత్వానికి బుద్ధి చెబుతుందని కాకాణి గోవర్ధన్ రెడ్డి హెచ్చరించారు.

