విశాఖపట్నం జిల్లా, (పున్నమి ప్రతినిధి): ఆగస్టు 6
టీడీపీ ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న “రెండేళ్ల నమ్మకం – ప్రజలతో మమేకం” కార్యక్రమంలో భాగంగా ఈరోజు భీమిలి నియోజకవర్గం మధురవాడ పరిధిలో ఉన్న వాంబే కాలనీ 7వ వార్డు పరిధిలోని 303వ బూత్‌లో ఇంటింటి ప్రచారం ఉత్సాహంగా కొనసాగింది.
భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, యువ నాయకుడు గంటా రవితేజ, రాష్ట్ర వాణిజ్య విభాగ కార్యదర్శి పిల్లా వెంకట్రావు, వార్డు అధ్యక్షుడు కానూరు అచ్యుత్‌రావు సూచనల మేరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ పార్టీ సందేశాన్ని చేరవేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో 303వ బూత్ ఇన్చార్జ్ పెంకి శంకర్, సీనియర్ కార్యకర్త దాసరి కాంతం, సీనియర్ నాయకుడు కొండబాబు, బెల్లంకి రమణ తదితరులు ఉదయం నుంచే ఇంటింటి ప్రచారంలో పాల్గొని ప్రజలతో మమేకమయ్యారు.
ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించడం ద్వారా పార్టీని మరింత ప్రజలకు చేరువ చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం కొనసాగుతున్నట్లు నాయకులు తెలిపారు.


