Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రెండు రోజుల వ్యవధిలో అన్నాచెల్లెళ్ల మృతి.. కుటుంబంలో తీరని విషాదం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రెండు రోజుల వ్యవధిలో అన్నాచెల్లెళ్ల మృతి.. కుటుంబంలో తీరని విషాదం

వార్త ముఖ్యాంశాలు

  • సర్వేపల్లి: నెల్లూరు జిల్లాలో చోటుచేసుకున్న వరుస విషాద ఘటన రెండు గ్రామాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.
  • రోడ్డు ప్రమాదంలో అన్న ప్రాణాలు కోల్పోగా, ఆయన అంత్యక్రియలకు హాజరైన చెల్లెలు గుండెపోటుతో మృతి చెందారు.మనుబోలు మండలం గొట్లపాలెం గ్రామానికి చెందిన విమలమ్మ (50)కు చెర్లోపల్లి గ్రామానికి చెందిన తన సోదరుడు ప్రభాకర్‌తో ఎంతో అనుబంధం ఉంది.
  • శుక్రవారం పొదలకూరు మండలం బ్రాహ్మణపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రభాకర్ మృతి చెందారు.ఈ విషయం తెలిసి తీవ్ర విషాదంలో మునిగిపోయిన విమలమ్మ శనివారం అన్న అంత్యక్రియలకు హాజరయ్యారు.

సర్వేపల్లి: నెల్లూరు జిల్లాలో చోటుచేసుకున్న వరుస విషాద ఘటన రెండు గ్రామాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. రోడ్డు ప్రమాదంలో అన్న ప్రాణాలు కోల్పోగా, ఆయన అంత్యక్రియలకు హాజరైన చెల్లెలు గుండెపోటుతో మృతి చెందారు.మనుబోలు మండలం గొట్లపాలెం గ్రామానికి చెందిన విమలమ్మ (50)కు చెర్లోపల్లి గ్రామానికి చెందిన తన సోదరుడు ప్రభాకర్‌తో ఎంతో అనుబంధం ఉంది. శుక్రవారం పొదలకూరు మండలం బ్రాహ్మణపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రభాకర్ మృతి చెందారు.ఈ విషయం తెలిసి తీవ్ర విషాదంలో మునిగిపోయిన విమలమ్మ శనివారం అన్న అంత్యక్రియలకు హాజరయ్యారు. సోదరుడి మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ క్రమంలో ఒక్కసారిగా అస్వస్థతకు గురై కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను పొదలకూరు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.రెండు రోజుల వ్యవధిలోనే అన్నాచెల్లెళ్లు ఇద్దరూ మృత్యువాత పడటంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. చెర్లోపల్లి, గొట్లపాలెం గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *