*జేసీకి వినతిపత్రం.. ప్రజా సంతకాల అందజేత*
ఆత్మకూరు, సెప్టెంబర్ 30 (పున్నమి ప్రతినిధి)టెండర్ పూర్తయి రెండు నెలలు.. రహదారి పనులు మాత్రం ప్రారంభం కాలేదు! నలపరెడ్డిపల్లి–మురగళ్ల–కనుపూరుపల్లి గ్రామాలను కలిపే ప్రధాన రహదారి అధ్వానంగా మారడంతో మూడు గ్రామాల ప్రజలు నిత్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆత్మకూరు మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు తోడేటి అశోక్ తెలిపారు. విద్యార్థులు, రైతులు, మహిళలు, వృద్ధులు, వాహనదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పనులను వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని కోరుతూ నెల్లూరు జిల్లా కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, ఐఏఎస్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.అధ్వానంగా మారిన రహదారితో మూడు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. విద్యార్థులు, రైతులు, మహిళలు, వృద్ధులు, వాహనదారులు నిత్యం అవస్థలు పడుతున్నారని జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, ఐఏఎస్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు నెల్లూరు జిల్లా కలెక్టరేట్లో జేసీని కలిసి వినతిపత్రం అందజేశారు. మూడు గ్రామాల ప్రజల నుంచి సేకరించిన సంతకాలనూ సమర్పించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేలోపు ఈ వారంలోనే పనులు ప్రారంభించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. రహదారి నిర్మాణాన్ని ఆలస్యం లేకుండా చేపట్టి పూర్తి చేయాలని అశోక్ విజ్ఞప్తి చేశారు.


