Monday, 8 June 2026
  • Home  
  • రుణమాఫీ వర్తించక గిరిజన రైతుల ఆందోళన
- ఖమ్మం

రుణమాఫీ వర్తించక గిరిజన రైతుల ఆందోళన

రుణమాఫీ వర్తించక గిరిజన రైతుల ఆందోళన తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఎదుట నిరసన ప్రదర్శన సమస్య పరిష్కారం కాకుంటే పోరాటం ఉద్ధృతం చేస్తాం: భూక్యా వీరభద్రం ఏన్కూర్, జూన్ 8: ప్రభుత్వం ప్రకటించిన రైతు రుణమాఫీ తమకు వర్తింపజేయకపోగా, వడ్డీ భారం పెంచి బ్యాంక్ అధికారులు ఒత్తిడి తెస్తున్నారని ఆరోపిస్తూ గిరిజన రైతులు సోమవారం ఆందోళనకు దిగారు. మూలపోచారం, రాంనగర్ తండా, నెమలిపురి, రంగాపురం గ్రామాలకు చెందిన భారీ సంఖ్యలో గిరిజన రైతులు తిమ్మారావుపేటలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తిమ్మారావుపేట సెంటర్ నుండి బ్యాంకు వరకు ర్యాలీగా బయలుదేరి ప్రదర్శన నిర్వహించారు. గతంలో పోడు భూమి హక్కు పత్రాల ఆధారంగా తీసుకున్న రూ. 25,000 రుణం, వడ్డీతో కలిసి ప్రస్తుతం రూ. లక్షకు పైగా పెరిగింది. అయితే, ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ ఈ రైతులకు వర్తించలేదు. దీనికి తోడు బ్యాంకు అధికారులు రుణం చెల్లించాలంటూ రైతులపై తీవ్ర ఒత్తిడి తేవడంతో, గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, సీపీఎం వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా భూక్యా వీరభద్రం మాట్లాడుతూ, గిరిజన రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వైరా ఎమ్మెల్యే మాళోత్ రాందాస్ నాయక్ ఈ సమస్యపై వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మర్చిపోయి, గిరిజనులను విస్మరించడం సరికాదని ఆయన హెచ్చరించారు. సమస్య పరిష్కారం కాకపోతే దశలవారీగా పోరాటాలను ఉద్ధృతం చేస్తామని స్పష్టం చేశారు. అనంతరం రైతులు బ్యాంకు మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు. స్పందించిన మేనేజర్, రైతుల సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే, ఫోన్ ద్వారా రీజనల్ మేనేజర్‌తో భూక్యా వీరభద్రం మాట్లాడి, వెంటనే రుణమాఫీ వర్తింపజేసి, రైతులకు ఎకరానికి లక్ష రూపాయల చొప్పున రుణాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు బానోత్ బాలాజీ, సీపీఎం మండల కార్యదర్శి దొంతబోయిన నాగేశ్వరరావు, ఏర్పుల రాములు, భూక్యా లక్ష్మ, ఇటికాల లెనిన్, రైతు సంఘం నాయకులు నండూరి శ్రీనివాసరావు, గుడ్ల వెంకటేశ్వర్లు, కొంగర సుధాకర్, మాడపాటి మల్లికార్జునరావు, వలపాల నరసింహారావుతో పాటు పోడు రైతులు బోడ రఘు, కోరం రాంమూర్తి, చీమల రాములమ్మ, ఇరప్ప భారతమ్మ, లాకావత్ రామీ, గూగుల్ హోలీ, రంగమ్మ, సమత, అచ్చమ్మ, గురవమ్మ తదితరులు పాల్గొన్నారు.

రుణమాఫీ వర్తించక గిరిజన రైతుల ఆందోళన

తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఎదుట నిరసన ప్రదర్శన

సమస్య పరిష్కారం కాకుంటే పోరాటం ఉద్ధృతం చేస్తాం: భూక్యా వీరభద్రం

ఏన్కూర్, జూన్ 8:

ప్రభుత్వం ప్రకటించిన రైతు రుణమాఫీ తమకు వర్తింపజేయకపోగా, వడ్డీ భారం పెంచి బ్యాంక్ అధికారులు ఒత్తిడి తెస్తున్నారని ఆరోపిస్తూ గిరిజన రైతులు సోమవారం ఆందోళనకు దిగారు. మూలపోచారం, రాంనగర్ తండా, నెమలిపురి, రంగాపురం గ్రామాలకు చెందిన భారీ సంఖ్యలో గిరిజన రైతులు తిమ్మారావుపేటలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తిమ్మారావుపేట సెంటర్ నుండి బ్యాంకు వరకు ర్యాలీగా బయలుదేరి ప్రదర్శన నిర్వహించారు. గతంలో పోడు భూమి హక్కు పత్రాల ఆధారంగా తీసుకున్న రూ. 25,000 రుణం, వడ్డీతో కలిసి ప్రస్తుతం రూ. లక్షకు పైగా పెరిగింది. అయితే, ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ ఈ రైతులకు వర్తించలేదు. దీనికి తోడు బ్యాంకు అధికారులు రుణం చెల్లించాలంటూ రైతులపై తీవ్ర ఒత్తిడి తేవడంతో, గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, సీపీఎం వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా భూక్యా వీరభద్రం మాట్లాడుతూ, గిరిజన రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వైరా ఎమ్మెల్యే మాళోత్ రాందాస్ నాయక్ ఈ సమస్యపై వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మర్చిపోయి, గిరిజనులను విస్మరించడం సరికాదని ఆయన హెచ్చరించారు. సమస్య పరిష్కారం కాకపోతే దశలవారీగా పోరాటాలను ఉద్ధృతం చేస్తామని స్పష్టం చేశారు. అనంతరం రైతులు బ్యాంకు మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు. స్పందించిన మేనేజర్, రైతుల సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే, ఫోన్ ద్వారా రీజనల్ మేనేజర్‌తో భూక్యా వీరభద్రం మాట్లాడి, వెంటనే రుణమాఫీ వర్తింపజేసి, రైతులకు ఎకరానికి లక్ష రూపాయల చొప్పున రుణాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు బానోత్ బాలాజీ, సీపీఎం మండల కార్యదర్శి దొంతబోయిన నాగేశ్వరరావు, ఏర్పుల రాములు, భూక్యా లక్ష్మ, ఇటికాల లెనిన్, రైతు సంఘం నాయకులు నండూరి శ్రీనివాసరావు, గుడ్ల వెంకటేశ్వర్లు, కొంగర సుధాకర్, మాడపాటి మల్లికార్జునరావు, వలపాల నరసింహారావుతో పాటు పోడు రైతులు బోడ రఘు, కోరం రాంమూర్తి, చీమల రాములమ్మ, ఇరప్ప భారతమ్మ, లాకావత్ రామీ, గూగుల్ హోలీ, రంగమ్మ, సమత, అచ్చమ్మ, గురవమ్మ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.