కొమురం భీం ఆసిఫాబాద్(పున్నమి ప్రతినిధి, తేది :02/10/2026): వేములవాడలో అక్టోబర్ 2 నుంచి 5 వరకు జరగనున్న రాష్ట్రస్థాయి జూనియర్ బాలుర కబడ్డీ పోటీలకు ఆసిఫాబాద్ గిరిజన ఆశ్రమ పాఠశాల 10వ తరగతి విద్యార్థి కొట్నాక రోషన్ ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా ఐటీడీఏ పీవో మందా మకరంద్, గిరిజన సంక్షేమ శాఖ డీడీ జాదవ్ అంబాజీ విద్యార్థిని అభినందించారు. పాఠశాల హెచ్ఎం చంద్రశేఖర్, పీఈటీ అరవింద్, అధికారులు, కోచ్‌లు, కబడ్డీ అసోసియేషన్ ప్రతినిధులు, అధ్యాపకులు రోషన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
ASIFABAD
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఆశ్రమ పాఠశాల విద్యార్థి ఎంపిక