Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ASIFABAD

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఆశ్రమ పాఠశాల విద్యార్థి ఎంపిక

కొమురం భీం ఆసిఫాబాద్(పున్నమి ప్రతినిధి, తేది :02/10/2026): వేములవాడలో అక్టోబర్ 2 నుంచి 5 వరకు జరగనున్న రాష్ట్రస్థాయి జూనియర్ బాలుర కబడ్డీ పోటీలకు ఆసిఫాబాద్ గిరిజన ఆశ్రమ పాఠశాల 10వ తరగతి విద్యార్థి కొట్నాక రోషన్ ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా ఐటీడీఏ పీవో మందా మకరంద్, గిరిజన సంక్షేమ శాఖ డీడీ జాదవ్ అంబాజీ విద్యార్థిని అభినందించారు. పాఠశాల హెచ్‌ఎం చంద్రశేఖర్, పీఈటీ అరవింద్, అధికారులు, కోచ్‌లు, కబడ్డీ అసోసియేషన్ ప్రతినిధులు, అధ్యాపకులు రోషన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *