తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ న్యూఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్‌ను కలిశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన చేసిన తొలి మర్యాదపూర్వక భేటీ ఇది.
ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి, కేంద్ర-రాష్ట్ర సంబంధాలు మరియు పలు కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం. అనంతరం కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కూడా కలిశారు.
ఈ భేటీలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.


