డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా;
రాజోలు: టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, రాజోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్ గొల్లపల్లి అమూల్య ఆధ్వర్యంలో 47వ వారం ‘క్యాడర్ విత్ లీడర్’ కార్యక్రమం శుక్రవారం శివకోటిలోని టీడీపీ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా 55 మంది లబ్ధిదారులకు రూ.27,34,575 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) చెక్కులను అమూల్య పంపిణీ చేశారు. ఆర్థిక ఇబ్బందులతో వైద్యం పొందుతున్న కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్ అండగా నిలుస్తోందన్నారు. పార్టీ కార్యకర్తలు, ప్రజల నుంచి వ్యక్తిగత, స్థానిక సమస్యలపై ఆర్జీలను స్వీకరించి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ తదితర నాయకత్వానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. గత 9 నెలల్లో 264 మందికి రూ.1.30 కోట్ల సీఎంఆర్‌ఎఫ్ సాయం అందించినట్లు వెల్లడించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు.



