ఏర్పేడు, జూన్ 03, (పున్నమి న్యూస్) ఏర్పేడు మండలం మడిబాక గ్రామపంచాయతీ పరిధిలోని రాజులకండ్రిగ గ్రామంలో శ్రీ గంగమ్మ జాతర మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతోంది. గ్రామ దేవత గంగమ్మ తల్లికి భక్తులు ఉదయం నుంచే ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేస్తూ తమ మొక్కులను భక్తిశ్రద్ధలతో చెల్లించుకుంటున్నారు. గ్రామ ప్రముఖులు మణిరాజు, కడివెళ్ళ మల్లికార్జున్, రామకృష్ణమ రాజు, చెంగముని, శ్రీకాంత్‌లతో పాటు గ్రామస్థులంతా కలిసి ఈ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. జాతరలో భాగంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరించిన సారె, పసుపు, కుంకుమలను సమర్పించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. స్థానిక యువకులు, భక్తులు విభిన్న రకాల విచిత్ర వేషధారణలతో అలరిస్తూ అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రదర్శనలు నిర్వహించారు. డప్పు వాయిద్యాలు, భక్తి కీర్తనలతో రాజులకండ్రిగ గ్రామంలో ఎటుచూసినా ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతూ పండుగ వాతావరణం సంతరించుకుంది.

రాజులకండ్రిగలో వైభవంగా శ్రీ గంగమ్మ జాతర-పోటెత్తిన భక్తజనం