రచయిత షేక్ మహమ్మద్ ఖాజాను కలిసిన కవి షేక్ హాజీ గౌస్
ఖాజీపేట నంది పత్రిక ప్రతినిధి జూలై 03
వైఎస్సార్ కడప జిల్లా ఖాజీపేటకు చెందిన సూక్ష్మ నిర్మాణాల కళాకారుడు, కవి షేక్ హాజీ గౌస్ సోమవారం పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు, రచయిత షేక్ మహమ్మద్ ఖాజాను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఖాజీపేట చరిత్ర, సాహిత్యం, చారిత్రక విశేషాలపై ఇద్దరూ చర్చించారు. ఉమర్ ఫరూక్ ఖాన్ రచించిన “భారతీయ ముస్లిమ్స్ లెజెండ్స్” పుస్తకాన్ని షేక్ హాజీ గౌస్ రచయిత షేక్ మహమ్మద్ ఖాజాకు అందజేశారు. ప్రతిగా షేక్ మహమ్మద్ ఖాజా “ఉదయగిరి వైభవం–చరిత్ర” పుస్తకాన్ని షేక్ హాజీ గౌస్‌కు బహూకరించారు. ఈ సందర్భంగా చరిత్ర, సాహిత్య పరిరక్షణకు పరస్పరం కృషి చేయాలని ఆకాంక్షించారు.


