రంగారెడ్డి జిల్లా అక్రిడేషన్ కమిటీ తొలి సమావేశం
పున్నమి న్యూస్
తెలంగాణ ఇంచార్జి
ఏప్రిల్ 29
రంగారెడ్డి జిల్లా అక్రిడేషన్ కమిటీ తొలి సమావేశం ఈరోజు కొంగరకలాన్‌లోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించబడింది. కమిటీ చై ర్మన్‌గా ఉన్న జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి అక్రిడేషన్ కమిటీ సభ్యులు హాజరయ్యారు. ఈ సమావేశంలో జిల్లా ప్రజా సంబంధాల అధికారి (డిపిఆర్ఓ) పాల్గొని, జర్నలిస్టుల అక్రిడేషన్ ప్రక్రియ, మార్గదర్శకాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు జారీ చేసే విధానం, అర్హతలు, పారదర్శకతపై సభ్యులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. సమావేశం సానుకూల వాతావరణంలో సాగి, తొలి మీటింగ్ విజయవంతంగా పూర్తయ్యింది. జిల్లాలో మీడియా ప్రతినిధులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని అధికారులు తెలిపారు..




