డాబా గార్డెన్ లో జరిగిన సమావేశం లో
విశాఖపట్నం మొబైల్స్ సేల్స్ & సర్వీస్ సిటీ యూనియన్ కార్యవర్గం ఏర్పాటు
విశాఖపట్నం జిల్లా , (పున్నమి ప్రతినిధి)ఆగస్టు 12: :మొబైల్ షాపుల యజమానుల సంక్షేమం, సమస్యల పరిష్కారం, వ్యాపార ప్రయోజనాల పరిరక్షణ లక్ష్యంగా “వైజాగ్ మొబైల్స్ సేల్స్ & సర్వీస్ – షాప్స్ ఓనర్స్ వెల్ఫేర్ సొసైటీ–సిటీ యూనియన్” ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా ఆగస్టు 12న ఉదయం 10 గంటలకు డాబాగార్డెన్స్ లోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో సమావేశం నిర్వహిం చారు.
మొబైల్ షాపుల యజమానులకు న్యాయమైన ధరలు, సిమ్ సేవలు, ఐడీ కార్డులు, వ్యాపార సంబంధిత సమస్యలపై పరస్పర సహకారం అందించడమే లక్ష్యంగా యూనియన్ పనిచేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. “ఒకటైతే శక్తి… ఐక్యమే విజయం” అనే నినాదంతో మొబైల్ వ్యాపారులందరినీ ఏకతాటిపైకి తీసుకురావాలని మధురువాడ యూనియన్ కి పిలుపునిచ్చి ఆ యూనియన్ లో చేర్చడం జరిగింది .
ప్రధాన కార్యవర్గం
– పి. విజయ శంకర్ – అధ్యక్షుడు, దాబాగార్డెన్స్
– బి. గుప్తాజీ – ఉపాధ్యక్షుడు, హెచ్‌బీ కాలనీ
– ఎం. కిరణ్ కుమార్ – ప్రధాన కార్యదర్శి, కంచరపాలెం
– ఎల్. గోవింద్ రెడ్డి – సంయుక్త కార్యదర్శి, ఎన్ఏడీ జంక్షన్
– వి. శ్రీనివాసరావు – కోశాధికారి, జెడ్పీ
మెయిన్ బాడీ సభ్యులు
ఎం.ఏ. మూర్తి (గోపాలపట్నం), ఎం. గణేష్ (జగదాంబ జంక్షన్), ఐ. సుధాకరరావు (వన్‌టౌన్), చి. చినబాబు (సీతమ్మధార), బి. అప్పలరాజు (సత్యం జంక్షన్), జి. శివకుమార్ (ఎంవీపీ కాలనీ), ఎ. రాంబాబు (హెచ్‌బీ కాలనీ), జి. కృష్ణంరాజు (ఉర్వశి జంక్షన్), జె. కిషోర్ (కంచరపాలెం), బి. సంతోష్ కుమార్ (మురళీనగర్), పి. జగన్ (పెందుర్తి), ఎస్. మనోజ్ కుమార్ (మర్రిపాలెం జంక్షన్), జి. రాజా (పీఎం పాలెం), ఐ. వెంకటరాజు (మధురవాడ), పి. శ్రీనివాస్ (మధురవాడ), పి. నాగరాజు (దొండపర్తి జంక్షన్), చి. శ్రీకాంత్ (రైల్వే న్యూ కాలనీ), కె.బి.ఎస్.వి.పి. రావు గుప్తా (అక్కయ్యపాలెం), వి. సందీప్ (రైల్వే న్యూ కాలనీ), ఎ. అరుణ్ కుమార్ (కంచరపాలెం), ఎం. సత్యనారాయణ (ఎంవీపీ కాలనీ), ఎం. జానకిరామ్ (మారికివలస), పి. నాగరాజు (హెచ్‌బీ కాలనీ), దివాకర్ (అరిలొవ), శంకర్ నారాయణ (అరిలొవ).
మొబైల్ షాపుల యజమానుల ఐక్యతే బలం… హక్కుల పరిరక్షణే లక్ష్యం!





