ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఏప్రిల్ 20 (జిఎంకే రావ్ పున్నమి ప్రతినిధి). మనుబోలు మండలం: అర్హులైన చేనేత కార్మికులకు మే నెల నుంచి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించేందుకు ఏఈఈ అనిల్ కుమార్, జేఈఈ రాంబాబు కార్మికుల నివాసాలకు వెళ్లి వారి పనిముట్లు, వృత్తి పరిస్థితులను పరిశీలించారు. నిజమైన అర్హులను గుర్తించి పథకం లబ్ధి అందించడమే లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమం చేనేత కార్మికులకు ఉపశమనంగా మారనుంది.

మే నుంచి 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ – అర్హుల గుర్తింపులో అధికారులు