రాజన్న సిరిసిల్ల ఆగస్టు 4 పున్నమి ప్రతినిధి
ముస్తాబాద్: మండల కేంద్రంలోని పంచాయతీ భవనం రంగుల అంశంపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి స్పందించారు. గత 12 ఏళ్లుగా ఈ అంశంపై పెద్దగా దృష్టి సారించలేదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇటీవల పంచాయతీ భవనంపై ఉన్న అక్షరాలు స్పష్టంగా కనిపించేలా గ్రామ సర్పంచ్ కాషాయ రంగు వేయించినట్లు తెలిపారు. ఈ అంశంపై కాంగ్రెస్ నాయకులు తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారని పేర్కొన్నారు. ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై అన్ని వర్గాలు కలిసి పనిచేయడం అవసరమని ఆయన అన్నారు.


