డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజవర్గం
ముమ్మిడివరం: 2023 సెప్టెంబర్ 9న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టును గుర్తుచేసుకుంటూ “నిజం గెలిచింది” కార్యక్రమాన్ని ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించారు. మురమళ్ల శాసనసభ్యుల క్యాంపు కార్యాలయం వద్ద కూడా ఈ కార్యక్రమాన్ని దాట్ల పృథ్వీరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు జైలులో గడిపిన 53 రోజులకు గుర్తుగా 53 కొవ్వొత్తులను వెలిగించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్ని ఇబ్బందులు ఎదురైనా చివరకు నిజమే గెలుస్తుందని, చంద్రబాబు నాయుడు పోరాట స్ఫూర్తి కార్యకర్తలకు ఆదర్శమని అన్నారు. పగబట్టి చేశారు.. 53 రోజులు.. చివరకు నిజం గెలిచింది అనే సందేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది.

ముమ్మిడివరం నియోజకవర్గంలో ఘనంగా “నిజం గెలిచింది” కార్యక్రమం*
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజవర్గం ముమ్మిడివరం: 2023 సెప్టెంబర్ 9న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టును గుర్తుచేసుకుంటూ “నిజం గెలిచింది” కార్యక్రమాన్ని ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించారు. మురమళ్ల శాసనసభ్యుల క్యాంపు కార్యాలయం వద్ద కూడా ఈ కార్యక్రమాన్ని దాట్ల పృథ్వీరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు జైలులో గడిపిన 53 రోజులకు గుర్తుగా 53 కొవ్వొత్తులను వెలిగించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్ని ఇబ్బందులు ఎదురైనా చివరకు నిజమే గెలుస్తుందని, చంద్రబాబు నాయుడు పోరాట స్ఫూర్తి కార్యకర్తలకు ఆదర్శమని అన్నారు. పగబట్టి చేశారు.. 53 రోజులు.. చివరకు నిజం గెలిచింది అనే సందేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది.

