ఖమ్మం ఆగష్టు 5
(పున్నమి ప్రతినిధి)
ఖమ్మం నగరంలోని జలగంనగర్–కాల్వొడ్డు మధ్య మున్నేరు వంతెన వద్ద నీటి ఉధృతి పెరగడంతో తాత్కాలికంగా నిర్మించిన చప్టలు దెబ్బతిన్నాయి. దీంతో వాహనదారులు, ప్రయాణికులు ప్రమాదాలకు గురికాకుండా ఉండేందుకు పాత మున్నేరు వంతెనపై ద్విచక్ర వాహనాల రాకపోకలను తాత్కాలికంగా పునరుద్ధరించాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ట్రాఫిక్ పోలీసులకు ఆదేశించారు. గతంలో భారీ వర్షాల సమయంలో ఏర్పడిన ట్రాఫిక్ అంతరాయాలు, ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కమిషనర్ మున్నేరు ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించారు. భద్రతా చర్యలు కట్టుదిట్టం చేసి, అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.



