Wednesday, 23 September 2026
  • Home  
  • ముధోల్ ధాన్యలక్ష్మి రైస్ మిల్లులో రూ.16.21 కోట్ల అక్రమం.. ఒకరి అరెస్ట్
- నిర్మల్

ముధోల్ ధాన్యలక్ష్మి రైస్ మిల్లులో రూ.16.21 కోట్ల అక్రమం.. ఒకరి అరెస్ట్

ముథోల్‌లో భారీ ధాన్యం గోల్‌మాల్ ఆగస్టు 23 పున్నమి ప్రతినిది నిర్మల్ జిల్లా ముధోల్ :ముథోల్ మండల కేంద్రంలోని ధాన్యలక్ష్మి రైస్ మిల్లులో ప్రభుత్వ ధాన్యం భారీగా గోల్‌మాల్ అయినట్లు అధికారులు గుర్తించారు. ప్రభుత్వ ధాన్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు మిల్లుపై ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. సివిల్ సప్లై మేనేజర్ సుధాకర్ ఆధ్వర్యంలో మిల్లులోని రికార్డులు, ధాన్యం నిల్వలను క్షుణ్ణంగా పరిశీలించగా భారీగా వ్యత్యాసాలు బయటపడినట్లు సమాచారం. అధికారుల ప్రాథమిక నిర్ధారణ ప్రకారం మొత్తం 3,774 మెట్రిక్ టన్నుల ధాన్యం సీఎంఆర్‌కు సంబంధించి దుర్వినియోగం జరిగినట్లు గుర్తించారు. దీని విలువ సుమారు రూ.16.21 కోట్లు ఉంటుందని అధికారులు పేర్కొన్నట్లు సమాచారం. సీఎంఆర్‌లో భారీ వ్యత్యాసాలు… 2023–24 రబీ సీజన్‌లో మిల్లుకు అప్పగించిన 3,259 మెట్రిక్ టన్నుల ధాన్యానికి గాను కేవలం 85 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ మాత్రమే అందించినట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. మిగిలిన 3,131 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ అందించాల్సి ఉండగా అందించలేదని పేర్కొన్నారు. అదేవిధంగా ఖరీఫ్ సీజన్‌లో 1,383 మెట్రిక్ టన్నుల ధాన్యానికి గాను 496 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ మాత్రమే అందించినట్లు మిగిలిన సీఎంఆర్‌పై కూడా భారీ వ్యత్యాసాలు ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. ప్రభుత్వం రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని నిబంధనల ప్రకారం మిల్లింగ్ చేసి, ప్రభుత్వానికి సీఎంఆర్‌గా బియ్యం అందించాల్సి ఉండగా, నిబంధనలకు విరుద్ధంగా ధాన్యం మళ్లించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు.. ఒకరి అరెస్ట్… ఈ వ్యవహారంపై పౌరసరఫరాల శాఖ అధికారులు ముథోల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా ముథోల్ సీఐ రవీందర్ నాయక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేసుతో సంబంధం ఉన్న ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు, అతడిని రిమాండ్‌కు తరలించేందుకు చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. ప్రభుత్వ ధాన్యం మళ్లింపు వ్యవహారంలో ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది? ఎంతకాలంగా ఈ అక్రమాలు జరుగుతున్నాయి? ఇందులో మరెవరైనా భాగస్వాములుగా ఉన్నారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ముథోల్‌లో భారీ ధాన్యం గోల్‌మాల్
ఆగస్టు 23 పున్నమి ప్రతినిది
నిర్మల్ జిల్లా ముధోల్ :ముథోల్ మండల కేంద్రంలోని ధాన్యలక్ష్మి రైస్ మిల్లులో ప్రభుత్వ ధాన్యం భారీగా గోల్‌మాల్ అయినట్లు అధికారులు గుర్తించారు. ప్రభుత్వ ధాన్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు మిల్లుపై ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. సివిల్ సప్లై మేనేజర్ సుధాకర్ ఆధ్వర్యంలో మిల్లులోని రికార్డులు, ధాన్యం నిల్వలను క్షుణ్ణంగా పరిశీలించగా భారీగా వ్యత్యాసాలు బయటపడినట్లు సమాచారం. అధికారుల ప్రాథమిక నిర్ధారణ ప్రకారం మొత్తం 3,774 మెట్రిక్ టన్నుల ధాన్యం సీఎంఆర్‌కు సంబంధించి దుర్వినియోగం జరిగినట్లు గుర్తించారు. దీని విలువ సుమారు రూ.16.21 కోట్లు ఉంటుందని అధికారులు పేర్కొన్నట్లు సమాచారం.

సీఎంఆర్‌లో భారీ వ్యత్యాసాలు…

2023–24 రబీ సీజన్‌లో మిల్లుకు అప్పగించిన 3,259 మెట్రిక్ టన్నుల ధాన్యానికి గాను కేవలం 85 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ మాత్రమే అందించినట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. మిగిలిన 3,131 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ అందించాల్సి ఉండగా అందించలేదని పేర్కొన్నారు. అదేవిధంగా ఖరీఫ్ సీజన్‌లో 1,383 మెట్రిక్ టన్నుల ధాన్యానికి గాను 496 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ మాత్రమే అందించినట్లు మిగిలిన సీఎంఆర్‌పై కూడా భారీ వ్యత్యాసాలు ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. ప్రభుత్వం రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని నిబంధనల ప్రకారం మిల్లింగ్ చేసి, ప్రభుత్వానికి సీఎంఆర్‌గా బియ్యం అందించాల్సి ఉండగా, నిబంధనలకు విరుద్ధంగా ధాన్యం మళ్లించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

పోలీసులకు ఫిర్యాదు.. ఒకరి అరెస్ట్…

ఈ వ్యవహారంపై పౌరసరఫరాల శాఖ అధికారులు ముథోల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా ముథోల్ సీఐ రవీందర్ నాయక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేసుతో సంబంధం ఉన్న ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు, అతడిని రిమాండ్‌కు తరలించేందుకు చర్యలు చేపడుతున్నట్లు సమాచారం.
ప్రభుత్వ ధాన్యం మళ్లింపు వ్యవహారంలో ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది? ఎంతకాలంగా ఈ అక్రమాలు జరుగుతున్నాయి? ఇందులో మరెవరైనా భాగస్వాములుగా ఉన్నారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.