Monday, 21 September 2026
  • Home  
  • ముథోల్‌లో డ్రై డే కార్యక్రమాలు
- నిర్మల్

ముథోల్‌లో డ్రై డే కార్యక్రమాలు

పున్నమి ప్రతినిధి : మండల కేంద్రమైన ముథోల్‌లోని వివిధ వార్డుల్లో పంచాయతీ ఈవో అన్వర్ అలీ ఆధ్వర్యంలో మంగళవారం డ్రై డే కార్యక్రమాలు నిర్వహించారు. వర్షాకాలంలో మలేరియా, డెంగీ వంటి వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గ్రామపంచాయతీ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించారు. ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, నీటి నిల్వలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, దోమల వ్యాప్తిని నివారించేందుకు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ వర్షాకాల వ్యాధుల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు నజియా అఫ్రోజ్ , ఏఎన్ఎం జ్యోతి, ఆశ ఆశా కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు

పున్నమి ప్రతినిధి :
మండల కేంద్రమైన ముథోల్‌లోని వివిధ వార్డుల్లో పంచాయతీ ఈవో అన్వర్ అలీ ఆధ్వర్యంలో మంగళవారం డ్రై డే కార్యక్రమాలు నిర్వహించారు.
వర్షాకాలంలో మలేరియా, డెంగీ వంటి వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గ్రామపంచాయతీ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించారు. ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, నీటి నిల్వలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, దోమల వ్యాప్తిని నివారించేందుకు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ వర్షాకాల వ్యాధుల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు నజియా అఫ్రోజ్ , ఏఎన్ఎం జ్యోతి, ఆశ ఆశా కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.