వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవీక మిషన్ ద్వారా మొక్కల పెంపకానికి ప్రోత్సాహం
రంగంపేట, జూలై 25 (రమేష్ నాయుడు – పున్నమి ప్రతినిధి):
రంగంపేట మండలం ముకుందవరం గ్రామంలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవీక మిషన్ (గ్రామీణ్) పథకం ద్వారా పండ్ల మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పండ్ల మొక్కలను నాటారు.
గ్రామీణ ప్రాంతాల్లో పచ్చదనాన్ని పెంపొందించడంతో పాటు పండ్ల మొక్కల పెంపకం ద్వారా ప్రజలకు అదనపు ఆదాయ మార్గాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. పర్యావరణ పరిరక్షణతో పాటు గ్రామీణ ఆర్థికాభివృద్ధికి ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని ఎమ్మెల్యే నల్లమిల్లి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, రంగంపేట మండల కూటమి నాయకులు, ముకుందవరం గ్రామ కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

