Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

*మాంబట్టు లోని ఇ ప్యాక్ కంపెనీ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
*మాంబట్టు లోని ఇ ప్యాక్ కంపెనీ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం*

వార్త ముఖ్యాంశాలు

  • *డ్రైవర్ తల మీద నుండి దూసుకెళ్లిన లారీ* సూళ్లూరుపేట సెప్టెంబర్ 05 తడ మండలం మాంబట్టు సెజ్ లోని ఇ ప్యాక్ కంపెనీ సమీపంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
  • రోడ్డుపై నిలుచున్న లారీ కింద మరో లారీ డ్రైవర్ నిద్రిస్తుండగా తల పై లారీ వెళ్లడంతో డ్రైవర్ రాజీవ్ గాంధీ అక్కడికక్కడే మృతి చెందాడు.
  • సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

*డ్రైవర్ తల మీద నుండి దూసుకెళ్లిన లారీ*

సూళ్లూరుపేట సెప్టెంబర్ 05

తడ మండలం మాంబట్టు సెజ్ లోని ఇ ప్యాక్ కంపెనీ సమీపంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
రోడ్డుపై నిలుచున్న లారీ కింద మరో లారీ డ్రైవర్ నిద్రిస్తుండగా తల పై లారీ వెళ్లడంతో డ్రైవర్
రాజీవ్ గాంధీ అక్కడికక్కడే మృతి చెందాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పోలీసులు లారీ డ్రైవర్ శివ ని మరియు లారీని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇ ప్యాక్ కంపెనీ దగ్గర తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, స్పీడ్ బ్రేకర్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఇ ప్యాక్ కంపెనీ దగ్గర రోడ్డుకు ఇరువైపులా భారీ వాహనాలు పార్కింగ్ చేయడంతో ఇంతకుముందే ఎన్నో ప్రమాదాలు జరిగాయని స్థానికులు తెలిపారు.
ఇ ప్యాక్ కంపెనీ ముందు ఎన్నో ప్రమాదాలు జరుగుతున్న కంపెనీ యాజమాన్యం కంపెనీ ముందు నో పార్కింగ్ బోర్డులు గాని, స్పీడ్ బ్రేకర్లు గాని ఏర్పాటు చేయకపోవడంపై స్థానికుల నుండి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *