### మల్లాపూర్‌లో వుడ్ చిప్పర్, బయోచార్ కిల్న్ పరిశీలన
మల్లాపూర్‌లో టీజీఎస్పీడీసీఎల్ పైలట్ ప్రాజెక్టుగా వినియోగిస్తున్న వుడ్ చిప్పర్ మెషిన్, బయోచార్ కిల్న్ పనితీరును సీఎండీ జితేష్ వి. పాటిల్, ఐఏఎస్ పరిశీలించారు. విద్యుత్ లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను చిప్పర్ ద్వారా చిన్న ముక్కలుగా చేసి, బయోచార్ కిల్న్‌లో ప్రాసెస్ చేయడం ద్వారా వ్యర్థాలను విలువైన వనరుగా మార్చవచ్చని తెలిపారు. ఈ విధానం పర్యావరణహితమని పేర్కొన్నారు. ఉప్పల్ జోనల్ కమిషనర్ రాధిక గుప్తా ఈ కార్యక్రమాన్ని అభినందించారు. కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.




