నెల్లూరు జిల్లా మనుబోలు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో జలజాక్షి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం ఉత్సాహంగా నిర్వహించారు. సమావేశానికి ఎంపీటీసీలు, జడ్పీటీసీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరయ్యారు. మండలంలోని గ్రామాల్లో నెలకొన్న తాగునీరు, రోడ్లు, విద్యుత్, పారిశుధ్యం తదితర సమస్యలపై సభ్యులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఆయా సమస్యల పరిష్కారానికి అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రామాల అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో నిర్ణయించారు. ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు సమర్థవంతంగా అందేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సభ్యులు కోరారు.

మనుబోలులో ఉత్సాహంగా మండల సర్వసభ్య సమావేశం