ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా 15 ( పున్నమి ప్రతినిధి)
మనుబోలు: నెల్లూరు జిల్లా మనుబోలు పంచాయతీ కార్యాలయంలో మంగళవారం పశువుల సంత వేలం పాట హోరాహోరీగా సాగింది. డిప్యూటీ ఎంపీడీవో గరుడయ్య, పంచాయతీ సెక్రటరీ రాజశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేలం పాటలో పలువురు పోటీ పడ్డారు. చివరకు కోవూరుకు చెందిన సుబ్బారెడ్డి, మల్లికార్జున్రెడ్డి రూ.81.10 లక్షలకు పశువుల సంతను దక్కించుకున్నారు. ఇంత భారీ మొత్తానికి వేలం ఖరారు కావడం మనుబోలు ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. పశువుల సంతకు ఉన్న ఆదరణ, వ్యాపార అవకాశాల నేపథ్యంలో ఈ ధర పలికినట్లు స్థానికులు పేర్కొంటున్నారు.

మనుబోలు పశువుల సంత వేలంలో రికార్డు ధర
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా 15 ( పున్నమి ప్రతినిధి) మనుబోలు: నెల్లూరు జిల్లా మనుబోలు పంచాయతీ కార్యాలయంలో మంగళవారం పశువుల సంత వేలం పాట హోరాహోరీగా సాగింది. డిప్యూటీ ఎంపీడీవో గరుడయ్య, పంచాయతీ సెక్రటరీ రాజశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేలం పాటలో పలువురు పోటీ పడ్డారు. చివరకు కోవూరుకు చెందిన సుబ్బారెడ్డి, మల్లికార్జున్రెడ్డి రూ.81.10 లక్షలకు పశువుల సంతను దక్కించుకున్నారు. ఇంత భారీ మొత్తానికి వేలం ఖరారు కావడం మనుబోలు ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. పశువుల సంతకు ఉన్న ఆదరణ, వ్యాపార అవకాశాల నేపథ్యంలో ఈ ధర పలికినట్లు స్థానికులు పేర్కొంటున్నారు.

