రఘునాథపాలెం / ఖమ్మం
మంచుకొండ గ్రామంలో నిర్వహిస్తున్న వినాయక ఉత్సవాల్లో ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గంధసిరి వీరభద్రం గౌడ్ పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణనాథుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని, సనాతన ధర్మం, హిందూ ధర్మాన్ని ప్రతి ఒక్కరూ రక్షించుకోవాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, వార్డు మెంబర్ ధర్మాసోత్ రామారావు, ఎస్టీ మోర్చా జిల్లా నాయకులు, వార్డు మెంబర్ లకావత్ రమేష్, కిసాన్ మోర్చా మీడియా కన్వీనర్ లకావత్ నవీన్, సుమన్, దారావత్ గణేష్, భూక్యా నాగా, శంకర్ తదితరులు, గ్రామస్తులు పాల్గొన్నారు.



