బిజినేపల్లి: మంగనూరు ఇంటర్ డిస్ట్రిక్ చెక్‌పోస్ట్ వద్ద పోలీసు సిబ్బంది విధుల్లో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ ఆదేశించారు. బుధవారం ఆయన చెక్‌పోస్ట్‌తో పాటు బిజినేపల్లి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. భద్రతా చర్యలు, రికార్డుల నిర్వహణను పరిశీలించిన ఆయన, శాంతిభద్రతల పరిరక్షణలో అలసత్వం వహించవద్దన్నారు. పెండింగ్ కేసులను త్వరితగతిన ఛేదించాలని, స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులకు జాప్యం లేకుండా మెరుగైన పోలీసు సేవలు అందించాలని అధికారులకు స్పష్టం చేశారు.



