Monday, 17 August 2026
  • Home  
  • భవిత దివ్యాంగుల పాఠశాలకు కిరాణా వర్తక సంఘం విరాళం
- తూర్పు గోదావరి

భవిత దివ్యాంగుల పాఠశాలకు కిరాణా వర్తక సంఘం విరాళం

*జగ్గంపేట భవిత దివ్యాంగుల పాఠశాలకు కిరాణా వర్తక సంఘం విరాళం* *20 మంది విద్యార్థులకు సర్టిఫికెట్ ఫైల్ ఫోల్డర్లు, ఫలహారాలు పంపిణీ* *కాకినాడ, జగ్గంపేట, పున్నమి ప్రతినిధి , ఆగస్టు 17:* జగ్గంపేట మండలం భవిత ప్రత్యేక పాఠశాలలోని దివ్యాంగ విద్యార్థులకు జగ్గంపేట కిరాణా వర్తక సంఘం సహాయం అందించింది. సంఘం సభ్యులు 20 మంది దివ్యాంగ బాలబాలికలకు యాపిల్స్, బిస్కెట్లు పంపిణీ చేశారు. అదేవిధంగా విద్యా, వైద్య, దివ్యాంగ ధ్రువపత్రాలను భద్రపరచుకునేందుకు సర్టిఫికెట్ ఫైల్ ఫోల్డర్లను విరాళంగా అందజేశారు. పాఠశాల ఉపాధ్యాయులు అప్పాన పెద్దకాపు, తిత్తి చిన్నబాబు మాట్లాడుతూ దాతల సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమైన పత్రాల భద్రతకు ఈ ఫైల్ ఫోల్డర్లు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. పాఠశాలలో ప్రస్తుతం 100 మంది దివ్యాంగ విద్యార్థులు ఉన్నారు. వారందరికీ సర్టిఫికెట్ ఫైల్ ఫోల్డర్లు అవసరం ఉన్నాయి. అలాగే తరగతి గదులకు కుర్చీలు, ఫ్యాన్లు అవసరం. వరండాలో పిల్లలు భోజనం చేసే సమయంలో కోతుల బెడద ఉండడంతో వరండాకు ఐరన్ మెష్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఉపాధ్యాయులు తెలిపారు.ఈ అవసరాలను తీర్చేందుకు దాతలు, స్వచ్ఛంద సంస్థలు, సేవాభావం ఉన్నవారు ముందుకు రావాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగ విద్యార్థుల తల్లిదండ్రులు, కిరాణా వర్తక సంఘం నాయకులు పాల్గొన్నారు.

*జగ్గంపేట భవిత దివ్యాంగుల పాఠశాలకు కిరాణా వర్తక సంఘం విరాళం*
*20 మంది విద్యార్థులకు సర్టిఫికెట్ ఫైల్ ఫోల్డర్లు, ఫలహారాలు పంపిణీ*

*కాకినాడ, జగ్గంపేట, పున్నమి ప్రతినిధి , ఆగస్టు 17:*
జగ్గంపేట మండలం భవిత ప్రత్యేక పాఠశాలలోని దివ్యాంగ విద్యార్థులకు జగ్గంపేట కిరాణా వర్తక సంఘం సహాయం అందించింది.
సంఘం సభ్యులు 20 మంది దివ్యాంగ బాలబాలికలకు యాపిల్స్, బిస్కెట్లు పంపిణీ చేశారు. అదేవిధంగా విద్యా, వైద్య, దివ్యాంగ ధ్రువపత్రాలను భద్రపరచుకునేందుకు సర్టిఫికెట్ ఫైల్ ఫోల్డర్లను విరాళంగా అందజేశారు.
పాఠశాల ఉపాధ్యాయులు అప్పాన పెద్దకాపు, తిత్తి చిన్నబాబు మాట్లాడుతూ దాతల సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమైన పత్రాల భద్రతకు ఈ ఫైల్ ఫోల్డర్లు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
పాఠశాలలో ప్రస్తుతం 100 మంది దివ్యాంగ విద్యార్థులు ఉన్నారు. వారందరికీ సర్టిఫికెట్ ఫైల్ ఫోల్డర్లు అవసరం ఉన్నాయి. అలాగే తరగతి గదులకు కుర్చీలు, ఫ్యాన్లు అవసరం. వరండాలో పిల్లలు భోజనం చేసే సమయంలో కోతుల బెడద ఉండడంతో వరండాకు ఐరన్ మెష్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఉపాధ్యాయులు తెలిపారు.ఈ అవసరాలను తీర్చేందుకు దాతలు, స్వచ్ఛంద సంస్థలు, సేవాభావం ఉన్నవారు ముందుకు రావాలని వారు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో దివ్యాంగ విద్యార్థుల తల్లిదండ్రులు, కిరాణా వర్తక సంఘం నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.